‘వనజీవి’ రామయ్య స్ఫూర్తి మమ్మల్ని నడిపిస్తుంది: నాగబాబు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ఏప్రిల్ 12, 2025: ప్రకృతి సంరక్షణకు అంకితమైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారి మరణం తీవ్ర బాధను కలిగించింది. గతంలో

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్ఏప్రిల్ 12, 2025: ప్రకృతి సంరక్షణకు అంకితమైన పద్మశ్రీ ‘వనజీవి’ రామయ్య గారి మరణం తీవ్ర బాధను కలిగించింది. గతంలో హైదరాబాద్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనను సన్మానించే అవకాశం దక్కింది. ఆయన చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించి, కొంత ఆర్థిక సాయం కూడా అందజేశాం.

ఇది కూడా చదవండి..వనజీవి’ రామయ్య స్ఫూర్తిని జీవింపజేస్తాం: పవన్ కళ్యాణ్

ఇది కూడా చదవండి..జ్యువెల్స్ ఆఫ్ ఇండియా 10వ ఎడిషన్ ను ఆవిష్కరించిన రిలయన్స్ జ్యువెల్స్

Read this also…Reliance Jewels Unveils 10th edition of ‘Jewels of India – Tirupati collection’ for Akshaya Tritiya

అప్పటికే మొక్కలు నాటడంపై నాకున్న ఆసక్తితో, రామయ్య సలహాలు, సంప్రదింపులతో జీడిమెట్లలోని ప్రభుత్వ భూమిలో 8,000 నుంచి 10,000 మొక్కలను నాటి, వాటిని సంరక్షించే పనిలో భాగమయ్యాం. రామయ్య వంటి నిజమైన హీరోకు పద్మశ్రీ లభించడం ఆయన పర్యావరణ పరిరక్షణ పట్ల చూపిన అంకితభావానికి, నిష్ఠకు నిదర్శనం.

ఆయన నాటిన మొక్కలు ఇవాళ అనేక మందికి సేద తీరుస్తున్నాయి. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తున్న ప్రతి ఒక్కరి తరఫున ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు.

About Author