తెప్పపై భక్తులకు శ్రీ పార్థసారథిస్వామివారి కటాక్షం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 7,2025: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ
![](https://varahimedia.com/wp-content/uploads/2025/02/GovindarajaSwamy.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, తిరుపతి, ఫిబ్రవరి 7,2025: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం శ్రీ రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీ పార్థసారథిస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు.
సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8.00 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి తెప్పపై ఐదు చుట్లు విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు ఆశీర్వాదమిచ్చారు.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/02/GovindarajaSwamy.jpg)
శనివారం తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజనలు, హరికథ, సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.