అల్లుఅర్జున్ అరెస్టుపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అంశంపై తొలిసారిగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 30,2024: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం సంధ్య థియేటర్ తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు అంశంపై తొలిసారిగా స్పందించారు. “గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకున్నారు.

అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాల్సింది. ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది” అంటూ పవన్ కల్యాణ్ ఆరోపించారు.

అల్లుఅర్జున్‌ను మాత్రమే కాదు, అతని టీమ్‌ కూడా సంతాపం తెలపాల్సింది అన్నారు. ముఖ్యంగా, సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పకపోవడంపై పవన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. “రేవంత్ రెడ్డి ఓ స్థాయిలో ఉన్న బలమైన నేత.

బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా, అలానే అరెస్ట్ చేస్తారంటూ” పవన్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ చట్టం ఎవరికీ చుట్టం కాదని, ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలని ప్రస్తావించారు.

About Author