దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషిన్ హీరోగా కొత్త సినిమా మోషన్ పోస్టర్ విడుదల
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,30 నవంబర్, 2024: లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,30 నవంబర్, 2024: లైకా ప్రొడక్షన్స్ చిత్ర నిర్మాణ సంస్థ ఎన్నో గొప్ప సినిమాలను రూపొందిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకుంది. స్టార్ హీరోలు, దర్శకులతోనే సినిమాలు చేయటం కాకుండా, ఎంతో మంది న్యూ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌కు సహకారాన్ని అందిస్తూ ఎంకరేజ్ చేస్తోంది.
ఈ క్రమంలో ఇటీవల కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు లైకా సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అనౌన్స్మెంట్ సినీ ఇండస్ట్రీలో, సినీ ప్రేక్షకులు, మీడియాలో ఆసక్తిని రేకెత్తించింది.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్నట్లు పలువురి నటీనటుల చుట్టూ అల్లుకున్న ఊహాగానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ నేపథ్యంలో మూవీ మోషన్ పోస్టర్ ను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా విడుదల చేయడం అందరిలోనూ నూతనోత్సాహాన్ని నింపింది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ హెడ్ జికెఎం తమిళ్ కుమరన్ మాట్లాడుతూ ‘‘ప్రారంభం నుంచి మంచి కథకులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగానే జాసన్ సంజయ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఆయన తెరకెక్కించబోతున్న కథ, ఆయన నెరేషన్ విన్నప్పుడు డిఫరెంట్‌గా అనిపించింది.
అన్నింటికంటే ముఖ్యంగా, పాన్-ఇండియా దృష్టిని ఆకర్షించే ప్రధానమైన పాయింట్ ఉంది. మనం ఎక్కడా పొగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అనటాన్ని మనం చాలా సందర్భాల్లో వినే ఉంటాం. కానీ దాని కోసం మనం ఏం వెచ్చిస్తామనేదే ప్రధాన పాయింట్‌గా సినిమాను తెరకెక్కించబోతున్నారు.
ఈ చిత్రంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకులకు సుపరిచితుడైన సందీప్ కిషన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సరికొత్త కాంబో ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిస్తుందని మేం భావిస్తున్నాం’’ అన్నారు.
సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుతూ ‘‘తమన్ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నారు. ఇంకా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.
త్వరలోనే వారి వివరాలను తెలియజేస్తాం. 2025 జనవరి నుంచి సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాం’’ అని తెలిపారు.