జియో నుంచి కేవలం రూ.91కే కొత్త రీఛార్జ్ ప్లాన్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 10, 2024: భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ జియో, తన వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్‌లైన్ న్యూస్,సెప్టెంబర్ 10, 2024: భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ జియో, తన వినియోగదారుల కోసం సరికొత్త రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ నేతృత్వంలో రన్ అవుతున్న జియో, రూ.91కే కొత్త రీఛార్జ్ ప్లాన్‌ ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులు అనేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంది.

ఈ కొత్త రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటు కలిగి ఉంటుంది. వినియోగదారులకు అపరిమిత కాల్స్ తోపాటు రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు పంపే సౌకర్యాన్ని కూడా అందిస్తుంది. అదనంగా, ఈ ప్లాన్ ద్వారా 3 GB హై స్పీడ్ డేటా 28 రోజుల పాటు లభిస్తుంది. ఇంకా 200 ఎంబీ అదనంగా డేటా సౌకర్యం కూడా పొందవచ్చు.

జియో కస్టమర్ల కోసం విభిన్న రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతూ వారి అవసరాలను తీర్చడానికి ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందిస్తోంది. రూ.91 ప్లాన్‌ కూడా ఈ క్రమంలోనే ఒక ముఖ్యమైన పరిణామంగా చెప్పవచ్చు.

https://www.jio.com/selfcare/login/

About Author