పూజలు చేసే రోబో..
వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 12,2023: రోబోతో దీపావళి వేడుక మనిషికి బదులు రోబోలు దీపాలు వెలిగించి, గంటలు మోగిస్తూ
వారాహి మీడియాడాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నవంబర్ 12,2023: రోబోతో దీపావళి వేడుక మనిషికి బదులు రోబోలు దీపాలు వెలిగించి, గంటలు మోగిస్తూ భగవంతునికి హారతి ఇస్తాయని మీరు ఊహించగలరా..? ఇది భిన్నంగా అనిపించవచ్చు. కానీ దేవునికి పూజలు చేసే రోబోట్‌ని సిద్ధం చేశారు. రోబోటిక్స్ కంపెనీ ఆరెంజ్‌వుడ్ తన X హ్యాండిల్‌తో రోబో ఈ వీడియోను షేర్ చేసింది.
టెక్నాలజీ నేడు చాలా అభివృద్ధి చెందింది. మనిషిని పోలిన టెక్స్ట్‌ని రూపొందించే చాట్‌బాట్‌లు గత ఏడాది అందుబాటులోకి వచ్చాయి. మనిషి చేయగలిగిన పని, చేయలేని పనితో సహా అన్నిరకాల పనులను రోబోలు చేస్తున్నాయి.
మనిషికి బదులు రోబో దీపాలు వెలిగించి, గంటలు మోగిస్తూ భగవంతుని ఆరతి చేస్తారని ఊహించగలరా? ఇది భిన్నంగా అనిపించవచ్చు, కానీ ఒక రోబో దేవునికి హారతి ఇవ్వడమేకాకుండా, గంటలు కొట్టి పూజలు చేస్తోంది.
Indian Tech And Infra సంస్థ అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ వీడియోలో రోబో హారతి ప్రదర్శిస్తున్నట్లు గా కనిపించింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండియన్ టెక్ అండ్ ఇన్‌ఫ్రా తన ఎక్స్ హ్యాండిల్‌లో ఈ రోబోట్‌ను ఢిల్లీకి చెందిన రోబోటిక్స్ కంపెనీ ఆరెంజ్‌వుడ్ తయారు చేసిందని తెలియజేసింది.
ఢిల్లీకి చెందిన రోబోటిక్స్ కంపెనీ మోడల్‌ను అందించింది. ఢిల్లీకి చెందిన రోబోటిక్స్ కంపెనీ ఆరెంజ్‌వుడ్ దీపావళి వేడుకలను ప్రత్యేకంగా జరుపుకోవాలనుంది. అందులో భాగంగానే దేవుడికి పూజలు చేసే రోబోను రూపొందించింది.
రోబోట్ ఈ వీడియోను దాని ట్విట్టర్(X) హ్యాండిల్‌తో షేర్ చేసిన రోబోటిక్స్ కంపెనీ ఆరెంజ్‌వుడ్ దీనిని సాంకేతికత ,సంప్రదాయాల కలయిక అంటూ క్యాప్షన్ ఇచ్చింది.