ధనవంతులకు ఆతిథ్యమిచ్చే అత్యంత ఖరీదైన హోటల్స్..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 8, 2023: భారతదేశ వాణిజ్య రాజధానిగా పరిగణించే ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు ఉన్న తాజ్ హోటల్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 8, 2023: భారతదేశ వాణిజ్య రాజధానిగా పరిగణించే ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా ముందు ఉన్న తాజ్ హోటల్ విలాసవంతమైన అగ్రశ్రేణి హోటల్స్ లో ఒకటిగా పరిగణిస్తారు.
మూరిష్ అండ్ ఓరియంటల్, ఫ్లోరెంటైన్ శైలిలో నిర్మించారు. ఈ హోటల్ 1903సంవత్సరం నుంచి వీఐపీలకు సేవలందిస్తోంది. ఇందులో 285 సూట్ రూమ్స్ ఉన్నాయి. మన దేశంలో 2008లో తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న మొదటిఫైవ్ స్టార్ హోటల్ ఇదే.
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని రాంబాగ్ ప్యాలెస్ విలాసవంతమైన ఆతిథ్యాన్ని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఇక్కడ గతంలో జైపూర్ మహారాజా ప్యాలెస్, ఇప్పుడు దీనిని హెరిటేజ్ హోటల్‌గా మార్చారు.
ఇక్కడి ఉద్యానవనాలు, చారిత్రాత్మకమైన రాచరికపు ఆనందాన్ని అందిస్తారు. ఈ కారణంగానే ఇతర ప్రదేశాల నుంచి వచ్చే వ్యక్తులకు మొదటి ఎంపికగా ఉంటుంది. దీనిని ప్రపంచంలోనే అత్యుత్తమ హోటల్‌గా కూడా పరిగణిస్తారు.
రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో నిర్మించిన ఒబెరాయ్ ఉదయ్ విలాస్ ప్యాలెస్ విలాసవంతమైన హోటళ్ల జాబితా ఉంటుంది. పిచోలా సరస్సు ఒడ్డున నిర్మించారు. ఈ రిసార్ట్ 30ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి శిల్పాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ఇక్కడ అందమైన తోటలు, రాజస్థానీ సంస్కృతి కనిపిస్తుంది. వాస్తు పరంగా, ఇది భారతదేశంలోని అత్యంత అందమైన హోటళ్లలో ఒకటి. ట్రావెల్ అండ్ లీజర్ ప్రకారం, 2015 సంవత్సరంలో, ఇది ప్రపంచంలోని అత్యుత్తమ హోటల్‌లలో ఒకటిగా నిలిచింది.
జోధ్‌పూర్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ కూడా రాయల్ హోటళ్లలో చేర్చారు. ఇది 1928-1943 మధ్య నిర్మించిన మహారాజా ఉమైద్ సింగ్ ప్యాలెస్. ఇక్కడికి రాగానే ఎవరికైనా రాజుల అనుభూతి కలుగుతుంది. ఇక్కడ 70 ఆర్ట్ డెకర్ సూట్లు ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రాజకుటుంబం ఇప్పటికీ ఈ ప్యాలెస్‌లోని ఒక భాగంలో నివసిస్తోంది.
ఉదయపూర్‌లోని తాజ్ లేక్ ప్యాలెస్ హోటల్ అందంలో ఏ మాత్రం తీసిపోదు. ఇది పిచోలా సరస్సు మధ్యలో ఉంది. ఇది సరస్సుపై తేలియాడే ప్యాలెస్. ఇక్కడి మంచి అనుభూతి అందిస్తుంది. మార్బుల్ ఫినిషింగ్, ఖరీదైన సౌకర్యవంతమైన గదులు ఉన్నాయి. ఇక్కడికి విదేశీ పర్యాటకులు సైతం వస్తుంటారు.
దక్షిణాదిలో “గాడ్స్ ల్యాండ్” గా పిలిచే కేరళలో అద్భుతమైన రిసార్ట్ ఒకటి ఉంది. దీనిని సందర్శించిన తర్వాత మీరు ప్రపంచాన్ని మరచిపోతారు. వెంబనాడ్ సరస్సు ఒడ్డున ఉన్న కుమరకోమ్ లేక్ రిసార్ట్ మీకు అత్యంత విలాసాన్ని అందిస్తుంది. ఓపెన్ స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్, రెస్టారెంట్లు, గార్డెన్స్ మరెన్నో ఉన్నాయి. దీని ఇంటీరియర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది.