తెలంగాణలో ₹1,500 కోట్లతో బయోగ్యాస్ విప్లవం: EcoMax, Biovest, Spantech మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యం

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 1,2025: తెలంగాణను గ్రీన్ ఎనర్జీలో మార్గదర్శిగా నిలబెట్టేందుకు మూడు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు చేతులు కలిపాయి.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 1,2025: తెలంగాణను గ్రీన్ ఎనర్జీలో మార్గదర్శిగా నిలబెట్టేందుకు మూడు దేశీయ, అంతర్జాతీయ సంస్థలు చేతులు కలిపాయి. దక్షిణాఫ్రికాలోని Biovest Holdings, భారతదేశంలోని Spantech Engineers, EcoMax Energy సంస్థలు బయోగ్యాస్ రంగంలో సంచలనాత్మక భాగస్వామ్యానికి అడుగుపెట్టాయి. ఈ భాగస్వామ్యం ద్వారా రాష్ట్రంలో రూ.1,500 కోట్ల విలువైన గ్రీన్ ఇన్వెస్ట్‌మెంట్ రానుందని సంస్థలు ప్రకటించాయి.

ఈ ఒప్పందంలో భాగంగా Spantech సంస్థ తమ BioGenie™ బయోగ్యాస్ శుద్ధి సాంకేతికతను Biovest సంస్థకు అందించనుంది. అదే సమయంలో Biovest సంస్థ తమ నూతన హర్భా™ (Herba™) మాడ్యూలర్ డైజేషన్ టెక్నాలజీని Spantech కు లైసెన్స్ ఇస్తూ, హైదరాబాద్‌లో తయారీకి అనుమతిస్తోంది.

ఈ టెక్నాలజీల అమలుకు EcoMax Energy సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రత్యేక భాగస్వామిగా వ్యవహరించనుంది. తొలిదశలో రాష్ట్రంలో 20 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల నిర్మాణాన్ని EcoMax చేపట్టనుంది. దీనిలో భాగంగా ప్రతీ జిల్లాలో ఒక ప్లాంట్ ఏర్పాటే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు Spantech-EcoMax సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందాన్ని (MoU) కుదుర్చుకున్నాయి.

Also read this…Telangana Launches ₹1,500 Cr Green Drive with Biogas Innovation via Biovest-Spantech-EcoMax Alliance

Also read this…Telangana Launches ₹1,500 Cr Green Drive with Biogas Innovation via Biovest-Spantech-EcoMax Alliance

హర్భా™ టెక్నాలజీ విశిష్టతలు

“Mechanical Cow”గా పరిగణించే ఈ టెక్నాలజీ 36 గంటల హోల్డింగ్ టైమ్‌లో బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయగలదు (సాంప్రదాయ పద్ధతిలో ఇది 55 రోజులు పడుతుంది).

ఒక్క టన్ను ఫీడ్స్‌ టాక్‌కు 800 లీటర్ల బయోగ్యాస్ యీల్డ్, 80% పైగా మీథేన్ శాతం.

ఫ్యాక్టరీ-తయారీ మొబైల్ యూనిట్లుగా ఉండడం వల్ల నిర్మాణ పనులు అవసరం ఉండదు.

బైప్రొడక్ట్స్‌గా బయోచార్, వుడ్ వినిగర్, ఫుడ్-గ్రేడ్ CO₂, పోషక నీరు లభిస్తాయి.

2 కిలోవాట్ల కన్నా తక్కువ విద్యుత్‌తో పనిచేస్తుంది.

భారత బయోగ్యాస్ రంగానికి కొత్త దిశ

ఈ భాగస్వామ్యంపై స్పందించిన EcoMax CEO ఎం. రిత్విక్ రావు మాట్లాడుతూ – “తెలంగాణను స్వయం సమృద్ధి గల గ్రీన్ ఎనర్జీ కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఈ ప్రాజెక్ట్‌తో వేలాది గ్రీన్ ఉద్యోగాలే కాక, వ్యవసాయాన్ని కూడా బలోపేతం చేస్తున్నాం. గ్రీన్ ఫండ్లు, అభివృద్ధి బ్యాంకుల పెట్టుబడులను యూరప్ దేశాల నుండి సమీకరిస్తున్నాం” అని తెలిపారు.

ఇదే అంశంపై దక్షిణాఫ్రికా రాయబారి గిడియన్ లబానే మాట్లాడుతూ – “ఇది కేవలం వ్యాపార ఒప్పందం మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే కాక, శుభ్రమైన భవిష్యత్తు కోసం ఓ కీలక అడుగు” అని పేర్కొన్నారు.

విప్లవాత్మక మార్పు దిశగా

Biovest ఛైర్మన్ హారోల్డ్ ఎడ్వర్డ్స్ మాట్లాడుతూ – “Herba™ కేవలం సాంకేతికత కాదు, ఇది వ్యవసాయ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన స్కేలబుల్, సుస్థిర పరిష్కారం” అని తెలిపారు.

Spantech టెక్నాలజీ డైరెక్టర్ రామ్గోపాల్ మాట్లాడుతూ – “Herba™ టెక్నాలజీ భారతదేశ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలకు అనుగుణంగా వ్యవసాయం, రవాణా, పరిశ్రమలపై ప్రభావం చూపే పరిష్కారాన్ని అందిస్తుంది” అని అన్నారు.

ఇది కూడా చదవండి…హైదరాబాద్‌లో పిబి పార్ట్‌నర్స్ తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభం

Also read this…PBPartners Launches First Hyderabad Experience Center, Boosts Telangana Presence

విజన్‌కు వేదిక

Biovest వ్యవస్థాపకులు జోహాన్ బొతా, ఒట్టో హాగర్ మాట్లాడుతూ – “ఈ భాగస్వామ్యం ద్వారా బయోగ్యాస్ రంగంలో కొత్త ప్రమాణాలు స్థాపించబోతున్నాం” అని తెలిపారు.

iCollab Hub Foundation ఈ భాగస్వామ్యానికి బీటు-జీ (B2G) ఆదాయ మార్గాలను కల్పిస్తూ, ప్రభుత్వ ప్రాక్యూర్మెంట్‌లో సహకరించనుంది. సంస్థ ఛైర్మన్ ఎల్. శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ – “2030 నూతన శక్తి లక్ష్యాలు, 2070 నెట్-జీరో విజన్‌ను సాధించడంలో ఈ భాగస్వామ్యం కీలకం” అని తెలిపారు.

About Author