‘యూ ఐ ది మూవీ’ సినిమా రివ్యూ & రేటింగ్: థ్రిల్లింగ్ డిస్టోపియన్ యాక్షన్ సినిమా..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 20,2024: కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర నటించిన తాజా డిస్టోపియన్ యాక్షన్ చిత్రం ‘యూ ఐ ది మూవీ’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,డిసెంబర్ 20,2024: కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్ర నటించిన తాజా డిస్టోపియన్ యాక్షన్ చిత్రం ‘యూ ఐ ది మూవీ’ డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు వచ్చిన తొలి టాక్ తర్వాత, ఉపేంద్ర డైరెక్షన్, యాక్షన్, ఆయన స్టైల్ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో అలరించారు.

అయితే, ఈ చిత్రంలో సమాజానికి ఇచ్చే మెసేజ్, స్క్రీన్‌ప్లే ఎలా ఉంది..? ఇప్పుడు మనం పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

సినిమా కథ , డైరెక్షన్:
26 సంవత్సరాల క్రితం, “ఏ” సినిమాతో సమాజాన్ని వెండి తెరపై చూపించిన ఉపేంద్ర, ఈసారి 2040లో ప్రపంచం ఎలా ఉండనున్నదో అన్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

పొలిటికల్ పరిణామాలు , ప్రపంచ మార్పులు ఈ సినిమాలో ముఖ్యమైన అంశాలు. “మీరు తెలివైనవారైతే ఇప్పుడే థియేటర్ నుంచి వెళ్లిపోండి!” అనే ఆసక్తికరమైన టైటిల్ కార్డ్‌తో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

విజువల్స్ & సాంకేతిక అంశాలు..

సినిమాలో ఉపేంద్ర పోషించిన పవర్ ఫుల్ క్యారెక్టర్, పొలిటికల్ సెటైర్స్ , వివిధ సన్నివేశాలు గొప్పగా సాగాయి. ముఖ్యంగా, విజువల్స్, నేపథ్య సంగీతం వంటి సాంకేతిక అంశాలు ఈ చిత్రానికి బలమైనవిగా నిలిచాయి.

మొదటి సగంలో కొన్ని ఊహించదగిన స్క్రీన్‌ప్లే, సెటైర్‌లు పాలిటికల్ లీడర్స్ పై ఉన్నప్పటికీ, సినిమా ప్రారంభం నుంచి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు.

పర్ఫార్మెన్స్ & క్యారెక్టర్స్:
“యూ ఐ ది మూవీ”లో ఉపేంద్ర అద్భుతమైన వన్-మ్యాన్ ప్రదర్శనను చూపించారు. రియల్ స్టార్ పాత్రలో ఆయన ఆల్-ఆవర్ ఎంటర్‌టైన్ చేశాడు. రీస్మా నానయ్య కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో నిధి సుబ్బయ్య కూడా కీలకమైన పాత్ర పోషించారు.

సినిమా సందేశం,ప్రేక్షకుల స్పందన:
సినిమా కన్నడలో సూపర్ హిట్ అనిచెప్పాలి. మిగతా భాషల్లోనూ ఈ సినిమాకు మంచి టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్స్ పరంగా ఉపేంద్ర పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. అంతేకాదు ఫామిలీ ఆడియన్స్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు, అలాగే అమిర్ ఖాన్ కూడా ఈ చిత్రాన్ని ప్రశంసించారు.

రేటింగ్:
మొత్తానికి, ‘యూ ఐ ది మూవీ’ ఒక కొత్త కథాంశం, థ్రిల్లింగ్ అంశాలతో ప్రేక్షకులను బాగా అలరించింది. సాంకేతికంగా అద్భుతమైన విజువల్స్, నేపథ్య సంగీతం వంటి అంశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

సినిమా స్టార్టింగ్ 10 నిమిషాలు, ఇంటర్వెల్ సమయంలో వచ్చే ఉత్తేజకరమైన క్షణాలు, ప్రేక్షకులను పూర్తిగా మూవీలో నిమగ్నమయ్యేలా చేస్తాయి.

వారాహి మీడియా డాట్ కామ్ రేటింగ్: 3.5
సినిమా: అద్భుతమైన సినిమా.. !

About Author