స్కోర్ క్యా హువా – యస్ బ్యాంక్ జాతీయ క్రెడిట్ స్కోర్ ఉద్యమం..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,నవంబర్ 26,2025:వ్యాపారాన్ని విస్తరించాలని ఆకాంక్షిస్తున్న సూరత్‌కి చెందిన యువ ఎంట్రప్రెన్యూర్‌ కావచ్చు లేదా తొలిసారిగా

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ముంబై,నవంబర్ 26,2025:వ్యాపారాన్ని విస్తరించాలని ఆకాంక్షిస్తున్న సూరత్‌కి చెందిన  యువ ఎంట్రప్రెన్యూర్‌ కావచ్చు లేదా తొలిసారిగా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న జెన్ జెడ్ ప్రొఫెషనల్ కావచ్చు లేదా తొలి గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్న లక్నో జంట కావచ్చు భారత్‌లో కోట్లాది మంది ఆకాంక్షలన్నీ మూడు అంకెల సంఖ్యపై ఆధారపడి ఉంటోంది.

కానీ దీని గురించి ప్రజలకు పెద్దగా తెలియదు. అదే, క్రెడిట్ స్కోరు. ఇలాంటి అవగాహన లేమిని గుర్తించే, యస్ బ్యాంక్, భారతీయులు తమ పూర్తి ఆర్థిక సామర్థ్యాలను తెలుసుకునేందుకు వీలుగా, వారికి సాధికారత కల్పించే దిశగా, ‘స్కోర్ క్యా హువా’ పేరిట దేశవ్యాప్తంగా సీఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

‘స్కోర్ క్యా హువా’కి ScoreKyaHua.bank.in అనే మైక్రోసైట్ కీలకంగా ఉంటుంది. దీనికి CRIF హై మార్క్, నాలెడ్జ్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది. ఉచితంగా క్రెడిట్ స్కోర్‌ని చెక్ చేసుకునేందుకు, భారతదేశపు వైవిధ్యమైన క్రెడిట్ పరిస్థితులకి అనుగుణంగా, సులభతరంగా అర్థం చేసుకోగలిగేలా రూపొందించిన ఎడ్యుకేషనల్ కంటెంట్‌ని ఇది అందిస్తుంది.

తొలిసారిగా రుణం తీసుకుంటున్నవారు క్రెడిట్ ప్రొఫైల్‌ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేది ఈ మైక్రోసైట్ సవివరంగా, దశలవారీగా తెలియజేస్తుంది. అదే విధంగా, ప్రస్తుతం రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు, వ్యక్తిగత రుణం, వాహన రుణం లేదా గృహ రుణం కోసం దరఖాస్తు చేసుకుంటున్న పక్షంలో రోజువారీ ఆర్థిక అలవాట్లు ఏ విధంగా వారి క్రెడిట్ స్కోర్లను ప్రభావితం చేస్తాయనేది తెలుసుకునేందుకు ఈ ప్లాట్‌ఫాం సహాయకరంగా ఉంటుంది.

“సిసలైన ఆర్థిక సమ్మిళితత్వం అంటే రుణ లభ్యత మాత్రమే కాదని, దాన్ని వివేకవంతంగా ఉపయోగంచుకోవడంపై అవగాహన కూడా అని మేము విశ్వసిస్తాం. తమ ‘స్కోర్ క్యా హువా’ సీఎస్ఆర్ కార్యక్రమం ద్వారా క్రెడిట్ స్కోరు గురించి, దాన్ని మెరుగుపర్చుకునే విధానాల గురించి తెలుసుకోవడంలో ప్రతి భారతీయుడికి సహాయం అందించేలా యస్ బ్యాంక్ జాతీయ స్థాయిలో ఉద్యమం చేపట్టింది.

ప్రస్తుతం పరిజ్ఞానంలో గల అంతరాలను భర్తీ చేయడం, బాధ్యతాయుతమైన రుణ ప్రవర్తనతో రుణార్హత కలిగి ఉండే వ్యక్తుల సంఖ్యను పెంచడం మా లక్ష్యం. తమ ఆర్థిక భవిష్యత్తును తీర్చిదిద్దుకునేలా ప్రజలకు సరైన పరిజ్ఞానం సాధనాలు అందించి, వారికి సాధికారత కల్పించడం ద్వారా ఆర్థికంగా ఆత్మవిశ్వాస భారత్‌ను నిర్మించే దిశగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం” అని యస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో Mr. ప్రశాంత్ కుమార్ తెలిపారు.

“CRIF క్రెడిట్ స్కోర్ అందించడం ద్వారా ‘స్కోర్ క్యా హువా’కి సంబంధించి నాలెడ్జ్ భాగస్వామిగా యస్ బ్యాంక్‌తో చేతులు కలపడం మాకు సంతోషకరమైన విషయం. ఆర్థికంగా బలహీన వర్గాలను కూడా ఆర్థిక సేవల పరిధిలోకి తేవడానికే కాకుండా పటిష్టమైన, సుదీర్ఘ ఆర్థిక ప్రస్థానాలకు సంబంధించి రుణాలు, వాటి ప్రభావం గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం.

అందుకే రుణాలపై అవగాహనను పెంపొందించడంపై CRIF ప్రధానంగా దృష్టి పెడుతోంది. ప్రతి ఒక్కరు స్పష్టత, ఆత్మవిశ్వాసంతో తమ రుణ ప్రస్థానాన్ని తమ చేతుల్లోకి తీసుకునేలా, అందరికీ సాధికారత కల్పంచే ఆచరణాత్మక విశ్లేషణలు, సాధనాలు అందించాలనేది మా లక్ష్యం” అని CRIF హై మార్క్ చైర్మన్, రీజనల్ మేనేజింగ్ డైరెక్టర్ (CRIF ఇండియా అండ్ సౌత్ ఏషియా) Mr. సచిన్ సేఠ్ తెలిపారు.

క్రెడిట్ స్కోరుపై అపోహలు తొలగించేందుకు యస్ బ్యాంక్ నాలుగు టెలివిజన్ ప్రకటనలను రూపొందించింది. ప్రతిరోజు ఎదురయ్యే సందర్భాల్లో ఆర్థిక పరిజ్ఞానాన్ని ఇమిడ్చే విధంగా ఇవి ఉన్నాయి. ‘స్కోర్ క్యా హువా’ అనేది ఆర్థిక అక్షరాస్యత ప్రాథమిక హక్కుగా ఉండేలా, ముంబైలో ఉన్న వ్యక్తికి సరిసమానంగా జైపూర్‌లోని వ్యక్తికి కూడా రుణ పరిజ్ఞానం అందుబాటులో ఉండే విధంగా భారత్‌ని తీర్చిదిద్దాలనే యస్ బ్యాంక్ విజన్‌ని ప్రతిబింబిస్తుంది.

ఈ మైక్రోసైట్‌లో ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన బ్లాగ్లు, సమాచారంతో కూడుకున్న వీడియోలు, క్రెడిట్ స్కోర్లపై అపోహలను తొలగించే అంశాలు, వివిధ రకాల ఆర్థిక నిర్ణయాలు ఏ విధంగా తమ స్కోర్లను ప్రభావితం చేస్తాయనేది యూజర్లు తెలుసుకోవడానికి ఉపయోగపడే ఇంటరాక్టివ్ క్రెడిట్ సిమ్యులేటర్‌లాంటివి ఉంటాయి.

ఆర్థిక సమ్మిళితత్వం దిశగా భారత్ పురోగమించే క్రమంలో ‘స్కోర్ క్యా హువా’ అనేది తమ క్రెడిట్ స్కోర్ శక్తి గురించి తెలుసుకునేందుకు ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఆహ్వానంలాంటిది. దీని గురించి మరింత తెలుసుకునేందుకు ScoreKyaHua.bank.inని సందర్శించగలరు

Link of the microsite – https://www.scorekyahua.bank.in/

Ad Film Links:

1.      https://youtu.be/ehNMcyACUjs?si=VX7qMerPUNwrf6A2

2.      https://youtu.be/oCeBesGjFdg

3.      https://youtu.be/ZYpdD0TY0B0

4.      https://youtu.be/jcsewMobjhs

About Author