కావిటీస్‌కు చెక్… డాబర్ రెడ్ పేస్ట్‌తో దంత సంరక్షణ!
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025:చిన్నా పెద్దా తేడా లేకుండా దంత సమస్యలు ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తున్నాయని డాక్టర్ సోనియా దత్తా (ఎండీఎస్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025:చిన్నా పెద్దా తేడా లేకుండా దంత సమస్యలు ప్రతి ఒక్కరినీ పట్టిపీడిస్తున్నాయని డాక్టర్ సోనియా దత్తా (ఎండీఎస్, పీహెచ్డీ, ప్రొఫెసర్ – పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ) తెలిపారు. నోటి పరిశుభ్రత లోపించడమే కాకుండా, రెడీ టూ ఈట్ ఫుడ్స్, తీపి పదార్థాలు, సాఫ్ట్‌డ్రింక్‌ల వినియోగం కూడా కావిటీస్‌కు కారణమవుతున్నాయని ఆమె చెప్పారు.
చికిత్స చేయని కుహరాలు (కావిటీస్) కాలక్రమంలో దంతాల గడ్డలు, ముఖ ఇన్ఫెక్షన్లకు దారితీయొచ్చని హెచ్చరించారు. అందుకే సరైన దంత సంరక్షణతో ముందే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కావిటీస్ ఎందుకు వస్తాయి..?
దంతాలపై ఏర్పడే ఫలకం (ప్లాక్) వల్ల బ్యాక్టీరియా పెరిగి దంత ఎమలును ధ్వంసం చేస్తుంది. చక్కెర, పిండి పదార్థాలపై బాక్టీరియా ఎక్కువగా పెరుగుతుంది. ఫలితంగా ఆమ్లాలు ఉత్పత్తి చేసి దంత క్షయానికి దారితీస్తాయి. దీనికి తోడు రోజూ బ్రష్ చేయకపోవడం, ఫ్లోసింగ్ అలవాటు లేకపోవడం దంతాలు క్షీణించేందుకు అవకాశం కల్పిస్తాయి. తరచూ తీపి పదార్థాలను తినడం కూడా ఒక పెద్ద కారణమే.
ఇది కూడా చదవండి..‘ప్రేమకు జై’ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల..
Read this also…‘Premaku Jai’ Brings a Fresh Love Story to Theatres on April 11…
డాబర్ రెడ్ పేస్ట్ – సహజ రక్షణ

డాబర్ రెడ్ టూత్‌పేస్ట్‌లో లవంగం, వేప, అల్లం వంటి ఆయుర్వేద పదార్థాలు ఉంటాయి. ఇవి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నోటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పేస్ట్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) అంగీకార ముద్రను కూడా పొందిందని కంపెనీ వెల్లడించింది.
ఇది కూడా చదవండి..అమెరికా వీసా పొందడానికి మీ వెన్నంటే గెహిస్ ఇమ్మిగ్రేషన్ & ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్
Read this also…Gehis Immigration and International Legal Services Simplifies U.S. Visa Process for Artists and Entertainment Professionals
ఈ చిట్కాలు పాటిస్తే కావిటీస్‌కు గుడ్‌బై!
- రోజుకు రెండు సార్లు డాబర్ రెడ్ పేస్ట్‌తో బ్రష్ చేయాలి
- బ్రషింగ్ టెక్నిక్ సరిగా పాటించాలి
- రోజూ ఫ్లోసింగ్ చేయాలి
- చక్కెర తీసుకోవడాన్ని తగ్గించాలి
- మౌత్‌వాష్ ఉపయోగించాలి
- నెలకు ఒకసారి అయినా డెంటల్ చెక్అప్ చేయించుకోవాలి
- లాలాజలం ఉత్పత్తికి గమ్ నమలడం మంచిది
ఇలా నిత్య జీవితంలో ఈ చిన్న చిన్న అలవాట్లు పాటిస్తే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.