హైదరాబాద్ లో ప్రకృతి పరిరక్షణకు పరుగు – మైండ్ స్పేస్ REIT ఈకో రన్ విజయవంతం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 2, 2025: భావి తరాల ‘పచ్చని’ భవిష్యత్తు కోసం హైదరాబాద్ పరుగులు తీసింది. ఈ విశాలమైన విశ్వంలో మనకున్న ఏకైక

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మార్చి 2, 2025: భావి తరాల ‘పచ్చని’ భవిష్యత్తు కోసం హైదరాబాద్ పరుగులు తీసింది. ఈ విశాలమైన విశ్వంలో మనకున్న ఏకైక భూగ్రహాన్ని కాపాడుకోవాలనే విలువైన సందేశాన్ని ఇస్తూ…. రేడియో మిర్చి, మైండ్ స్పేస్ REIT సంయుక్తంగా నిర్వహించిన మైండ్ స్పేస్ REIT ఈకో రన్ ఆద్యంతం ఆకట్టుకుంది.
4వేలకు పైగా రన్నర్లతో… మాధపూర్ లోని మైండ్ స్పేస్ బిజినెస్ పార్క్ లో ఆదివారం తెల్లవారు జామున మొదలైన ఈ ఈకో పరుగు…తిరిగే అదే గమ్య స్థానంలో ముగిసింది. హైదరాబాద్ తో పాటు రాజస్థాన్, పాండిచ్చేరి, మదురై, తిరునెల్వేలి తో సహా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అథ్లెట్లు ఈ రన్‌లో పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి...పిఠాపురం శ్రీ పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
ఇది కూడా చదవండి...శ్రీ వేంకటేశ్వరస్వామివారి మోహినీ అలంకార సేవా వైభవం
ఇది కూడా చదవండి...L2 ఎంపురాన్’ నుంచి గేమ్ ఆఫ్ థ్రోన్స్ నటుడు జెరోమ్ ఫ్లిన్ కీలక పాత్రను రివీల్ చేసిన చిత్ర బృందం
ఈ రన్ ఒక పోటీలా కాకుండా… పర్యావరణ పరిరక్షణ కోసం హైదరాబాద్ అంతా ఒక చోట చేరి చేసిన నినాదంలా ముందుకు సాగింది. వ్యర్థాలను తగ్గించడం, చెట్లు నాటడం, ఆరోగ్యంతో పాటు ప్రకృతిని రక్షిండం వంటి విషయాలపై తీసుకోవాల్సిన చర్యల ప్రాముఖ్యతను చాటుతూ ఈ రన్ సాగింది.
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, మౌళిక సదుపాయల సంస్థ- టీఎస్ఐఐసీ ఉపాధ్యక్షులు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. ఈ విష్ణు వర్థన్ రెడ్డి 21 కిలోమీటర్ల పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ కే. రహేజా కార్పొరేషన్ సీవోవో శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ…దైనందిన జీవితంలో పర్యావరణ హిత అలవాట్లు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు.

మిర్చి ఆర్జేలు స్వాతి, గౌరిక… ఈకో రన్ లో పాల్గొన్నవారిని తమ మాటలతో నిత్యం ఉత్సాహాపరుస్తూ… కార్యక్రమాన్ని కోలహాలంగా మార్చేశారు. సినీనటులు చాందినీ చౌదరి, అభినవ్ గోమటం కూడా ఈ రన్ లో పాల్గొని, తమ అభిమానులను పలుకరించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మైండ్ స్పేస్ REIT సీఈవో రమేశ్ నాయర్ మాట్లాడుతూ…. “ మైండ్ స్పేస్ REIT ఈకో రన్ కేవలం ఒక పరుగుల పోటీ కాదు. పర్యావరణ పరిరక్షణ కోసం, భూమికోసం ఈ రోజు ఒక అడుగు పడింది.
ఈ పరుగులో పాల్గొన్న ప్రతి ఒక్కరూ పర్యావరణంపై తమకు ఉన్న ప్రేమను చాటుకున్నారు. మన ఆరోగ్యంతో పాటు ప్రకృతిని కూడా కాపాడుకోవడం మన బాధ్యత అని రన్నర్లు ప్రపంచానికి తెలియజేశారు’’ అని అన్నారు.
Read this also… L2: Empuraan Goes Global – Game of Thrones Star Jerome Flynn Joins the Cast
ఇది కూడా చదవండి...స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ – భారత్‌లో అతిపెద్ద హోమ్ హెల్త్ కేర్ నెట్‌వర్క్ విస్తరణ
Read this also... Star Health Insurance Expands Home Health Care Network to 100 Locations Across India
అన్ని స్థాయిల రన్నర్లకు అనుగుణంగా, 5కే, 10కే, 21కే విభాగాల్లో మైండ్ స్పేస్ REIT ఈకో రన్ నిర్వహించారు. 18 ఏళ్ల పైబడిన వారికోసం 21కిలోమీటర్ల, 10 కిలోమీటర్ల పరుగు, 8 ఏళ్లు పైబడిన వారి కోసం 5 కిలోమీటర్ల పరుగులో పాల్గొన్నారు.
ఫిట్ నెస్ ఔత్సాహికుల నుంచి అనుభవజ్ఞులైన అథ్లెట్ల వరకు ప్రతి ఒక్కరూ పరుగులో పాల్గొన్నారు. అలా, మాదాపూర్‌లో నిత్యం ఉద్యోగులతో సందడిగా ఉండే మైండ్‌స్పేస్ బిజినెస్ పార్క్ REIT అంతా పర్యావరణ స్పృహను పెంచే శక్తివతంగమైన కేంద్రంగా మారింది.

అథ్లెట్లు, యాక్టివిస్టులు, పర్యావరణ ప్రేమికులతో రన్ అంతా ఉత్సాహాంగా సాగింది. పర్యావరణంపై ప్రేమను చాటుకోవడానికి వయసు అడ్డు కాదని ఉండదని నిరూపిస్తూ సీనియర్ సిటీజన్స్ కూడా ఈ పరుగులో పాల్గొని సందడి చేశారు.
ఈ ఈవెంట్ పర్యావరణహిత చర్యలకు ప్రాధాన్యత ఇచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ కాటన్ టీ-షర్ట్స్, ప్లాంటబుల్ బిబ్స్ అందించారు. 15 రీఫిల్ స్టేషన్లతో 10వేల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచారు. ప్లాస్టిక్‌ను తగ్గించి వ్యర్థాలను 90 శాతం వరకు తగ్గించడానికి, వ్యర్థాలను సక్రమంగా, పర్యావరణ హితంగా నిర్వహించడానికి స్క్రాప్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్ ఈ కార్యక్రమానికి భాగస్వామిగా పనిచేసింది.
కాగా, మొత్తం వ్యర్థాలలో 95 శాతం రీసైకిల్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాదు, ప్రత్యేకమైన గ్రీన్ స్టేషన్ల వద్ద పరుగులో పాల్గొన్నవారికి మొక్కలు నాటే అవకాశాన్ని కూడా కల్పించారు. 20 మంది స్పాన్సర్లు, జీరో షార్ట్‌కట్స్ తో మైండ్‌స్పేస్ REIT ఈకో రన్ విజయం సాధించడమే కాదు, ఒక కొత్త ప్రమాణాన్ని నెలకొల్పింది! మైండ్‌స్పేస్ మార్చి 9న ముంబై నగరానికి కూడా పర్యావరణ స్పృహ శక్తిని అందించడానికి ముందుకు కదిలింది. సిద్ధంగా ఉండండి.