పవన్ కళ్యాణ్‌కు రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్: పిఠాపురంలో అపోలో ఆసుపత్రి..!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, ఆగస్టు 17, 2024:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్ అందించబోతున్నట్లు సమాచారం.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,హైదరాబాద్, ఆగస్టు 17, 2024:ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు రామ్ చరణ్ అద్భుతమైన గిఫ్ట్ అందించబోతున్నట్లు సమాచారం. జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పిఠాపురం ప్రజలకు మరింత సేవలు అందించేందుకు రామ్ చరణ్ కూడా తనవంతుగా కృషి చేస్తున్నాడు. అందులో భాగంగా పిఠాపురంలో అపోలో ఆసుపత్రిని నిర్మించబోతున్నాడు.

ఈ ఆసుపత్రి నిర్మాణం కోసం రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పటికే పిఠాపురంలో 10 ఎకరాలు భూమిని కొనుగోలు చేసినట్లు అఖిలభారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవణం స్వామినాయుడు ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పవన్ కళ్యాణ్‌ను గెలిపించడానికి పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వరుణ్ తేజ్,సాయిధరమ్ తేజ్ కూడాపాల్గొన్నారు. వారు పిఠాపురం నియోజక వర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ అభివృద్ధి కార్యసాధన దిశగానే అపోలో ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని భావిస్తున్నారు.

పిఠాపురంలో అపోలో ఆసుపత్రి అందుబాటులోకి రాగానే, ఆ ప్రాంత ప్రజలకు అధునాతన వైద్య సేవలు అందుబాటులో ఉండనున్నాయి. పవన్ అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఉత్సాహంగా పంచుకుంటున్నారు.

About Author