“మీట్ & మింగిల్” కార్యక్రమం నిర్వహించడం ద్వారా ప్రతిష్టాత్మక మైలురాళ్లను జరుపుకున్న ముజిగల్ ఎడ్యుటెక్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, జనవరి 3, 2025: సంగీత విద్య కోసం భారతదేశంలో ప్రముఖ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా దోహదపడుతున్న ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఇండియా, జనవరి 3, 2025: సంగీత విద్య కోసం భారతదేశంలో ప్రముఖ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా దోహదపడుతున్న ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశం అంతటా 100+ అకాడమీ భాగస్వామ్యాలను అధిగమించడంతో పాటు, 2024లో 8,000+ మంది విద్యార్థులతో వృద్ధి చెందుతున్న ఒక సముదాయంగా అభివృద్ధి చెందింది.

ఈ విజయాలను సంభవింపజేసుకున్న సందర్భంగా, ముజిగల్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల నుండి తమ భాగస్వాములు, ఉపాధ్యాయులు, కార్పొరేట్ ఉద్యోగుల కోసం ఒక ప్రతిష్టాత్మక వేడుక నిర్వహించింది.

సంగీత విద్య ,వాయిద్యాలలో గ్లోబల్ లీడర్‌లతో ముజిగల్ బలమైన సహకారాన్ని ప్రదర్శిస్తూ, ఆల్‌ఫ్రెడ్, రాక్‌స్కూల్, ప్రోక్రాఫ్ట్, యమహా వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లతో కలిసి ఈ మైలురాయి వేడుకను జరుపుకుంది.

ఈ క్రమంలో, ముజిగల్ కర్ణాటక నుంచి తమ భాగస్వాములు ,ఉపాధ్యాయుల కోసం విజయవంతమైన “మీట్ & మింగిల్” పార్టీని నిర్వహించింది.

“ముజిగల్ విజయగాథ మా భాగస్వాములు, ఉపాధ్యాయులు ,ఉద్యోగుల అంకితభావానికి నిదర్శనం” అని ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు డాక్టర్ లక్ష్మీనారాయణ ఏలూరి అన్నారు. “ఈ వేడుకలు వారి కృషిని గౌరవించటానికి ,సంగీత విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా భాగస్వామ్య లక్ష్యం బలోపేతం చేయడానికి ఒక అవకాశంగా నిలుస్తాయి” అని ఆయన వివరించారు.

ఈ సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లలో తమ కార్యక్రమాలను విస్తరించాలని ముజిగల్ లక్ష్యంగా పెట్టుకుంది. సంగీత విద్యను మరింత సరసమైనదిగా , ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్న ముజిగల్, సంగీత నైపుణ్యాన్ని పెంపొందించడం ,అర్ధవంతమైన గ్లోబల్ భాగస్వామ్యాలను ఏర్పరచుకోవడంపై దృష్టి సారించడంతో, రాబోయే సంవత్సరాల్లో స్థిరమైన వృద్ధి ,నిరంతర ఆవిష్కరణలకు సిద్ధంగా ఉంది.

About Author

You may have missed