ఎల్జి గాలి కంప్రెసర్లతో మాన్+హమ్మెల్కు భారీ లాభం – ఏడాదికి రూ.13 కోట్ల పైగా ఆదా
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: పరిశ్రమలకు వడపోత వ్యవస్థల తయారీలో ముందున్న మాన్+హమ్మెల్ సంస్థ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఏప్రిల్ 10,2025: పరిశ్రమలకు వడపోత వ్యవస్థల తయారీలో ముందున్న మాన్+హమ్మెల్ సంస్థ తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ముందడుగు వేసింది. పాత గాలి కంప్రెషన్ వ్యవస్థను తొలగించి, ఎల్జి ఎక్విప్మెంట్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ప్యాటన్స్ ఇంక్ సహకారంతో ఆధునిక కంప్రెస్డ్ ఎయిర్ సిస్టమ్‌ను అమలు చేసింది. దీని ఫలితంగా సంస్థకు సంవత్సరానికి రూ.13 కోట్లు పైగా ఖర్చు తగ్గింది. అదేవిధంగా, 2 మిలియన్ కిలోవాట్గంటల విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గించగలిగింది.
గతంలో కంపెనీ వాడిన ఎయిర్ కంప్రెషన్ సిస్టమ్ రోజుకు 20కి పైగా డౌన్‌టైమ్ సమస్యలకు కారణమయ్యేది. గంటకు సుమారు 30 గ్యాలన్ల కలుషిత నీరు వల్ల పరికరాలపై ప్రభావం పడేది. దీని వల్ల ఉత్పత్తి నిలిచిపోవడంతో పాటు డోలర్లు లక్షల్లో ఖర్చవుతుండేది.
Read this also…Mann+Hummel Saves Over $160,000 Annually with ELGi’s Advanced Compressed Air System, Boosts Efficiency and Product Quality
ఇది కూడా చదవండి..‘కావిటీస్‌కు చెక్… డాబర్ రెడ్ పేస్ట్‌తో దంత సంరక్షణ!
ఇప్పుడు కొత్తగా అమలు చేసిన ఎల్జి గాలి కంప్రెసర్ వ్యవస్థ సంస్థకు ఊపిరి పోసింది. కంపెనీకి అవసరాల మేరకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ వ్యవస్థ 12 వారాల్లో పూర్తయింది. ఈ వ్యవస్థలో ఐదు ఎల్జి EG-160 రోటరీ స్క్రూ కంప్రెసర్లు, మూడు AR-2350 హై-పెర్ఫార్మెన్స్ ఎయిర్ డ్రైయర్లు, ఎయిర్మాటిక్స్ స్మార్ట్ కంట్రోల్ సిస్టమ్, ఎయిర్మేట్ ఎయిర్ రిసీవర్లు అమలయ్యాయి.

“ఇప్పుడు మా ప్లాంట్ కొత్తగా పుట్టినట్టే ఉంది. ఇప్పుడు పూర్తిగా స్థిరమైన గాలి పీడనంతో పనిచేస్తోంది. ఉత్పత్తిలో అంతరాయాలు లేవు. నాణ్యత పెరిగింది. ఇది మా ప్లాంట్‌కు జీవం పోసింది” అని సంస్థ తయారీ ఇంజనీరింగ్ సీనియర్ మేనేజర్ స్టీవెన్ ఓవెన్స్ తెలిపారు.
కోవిడ్ అనంతరం ఏర్పడిన 6 మిలియన్ యూనిట్ల బ్యాక్‌లాగ్‌ను సంస్థ త్వరితగతిన క్లియర్ చేయగలిగింది. ఇది సంస్థ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా, సరఫరా గొలుసు వ్యవస్థలో ముందడుగు వేసేలా చేసింది.
ఇది కూడా చదవండి..‘ప్రేమకు జై’ ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదల..
Read this also…‘Premaku Jai’ Brings a Fresh Love Story to Theatres on April 11…
డ్యూక్ ఎనర్జీ అందించే రిబేట్ ప్రోగ్రామ్‌ను సద్వినియోగం చేసుకుని, మాన్+హమ్మెల్కు $300,000 రిబేట్ వచ్చిందని, ఇందులో ప్యాటన్స్ కీలక పాత్ర పోషించిందని ట్రే కార్టర్ తెలిపారు.