“కే2 జెనాక్స్ తెలంగాణ మార్కెట్‌లో 20% అమ్మకాలు పెంచేందుకు వ్యూహం”
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 15 ఏప్రిల్, 2025: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీఎంటీ బార్ల (ఇంటెలిజెంట్స్ స్టీల్) తయారీదారు కే2

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, 15 ఏప్రిల్, 2025: భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టీఎంటీ బార్ల (ఇంటెలిజెంట్స్ స్టీల్) తయారీదారు కే2 జెనాక్స్ తెలంగాణలో తన వ్యాపారాన్ని వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో ఉక్కు ఉత్పత్తుల డిమాండ్ పెరిగిన నేపథ్యంలో, కంపెనీ తన టీఎంటీ బార్ ఉత్పత్తి సామర్థ్యాన్ని వచ్చే ఒక సంవత్సరంలో 20% పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కే2 జెనాక్స్ తమ డీలర్లు,పంపిణీదారుల నెట్‌వర్క్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో మాసన్ మీట్‌లు, బిల్డర్ మీట్‌లు, ‘నిర్మాణ కే శూర వీర్’ కార్యక్రమాల ద్వారా తమ డీలర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి యోచిస్తోంది.
Read this also…KAY2 Xenox Strengthens Footprint in Telangana, Targets 20% Sales Growth in One Year
ఇది కూడా చదవండి..తెలంగాణపై రూ.3100 కోట్లు బకాయి – ధరలు పెంచాలని మద్యం పరిశ్రమ డిమాండ్
కే2 జెనాక్స్ డైరెక్టర్ శ్రీ సునీల్ అగర్వాల్ మాట్లాడుతూ, “కే2 జెనాక్స్ అనేది ఆధునిక నిర్మాణ అవసరాలను పూరించడానికి రూపొందించిన ప్రీమియం ఉత్పత్తి. ఈ ఉత్పత్తి ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక మార్కెట్లలో ప్రవేశించి మంచి స్థానం సంపాదించుకుంది.

తెలంగాణలో వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి,అభివృద్ధి అవకాశాలు బట్టి ఈ మార్కెట్ మా వ్యాపార ప్రణాళికలో కీలకమైనది. రాష్ట్రంలోని నిర్మాణ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడమే మా లక్ష్యం,” అని అన్నారు.
కే2 జెనాక్స్ అనేది KAY2 TMT బార్ల ప్రీమియం బ్రాండ్. దీని ప్రత్యేకమైన రిబ్ డిజైన్ కాంక్రీటుతో ఉన్నతమైన బంధాన్ని సాధిస్తుంది, తద్వారా నిర్మాణం మరింత దృఢంగా ఉంటుంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోనూ ఈ టీఎంటీ బార్లను వినియోగించడం ఉత్తమ పరిష్కారం. 720 డిగ్రీల హెక్సాగొనల్ కోణాలతో, ఈ టీఎంటీ బార్ల బాండింగ్ శక్తి మరింత పెరుగుతుంది, ఇది నిర్మాణానికి అద్భుతమైన మద్దతు ఇస్తుంది.
Read this also…Indian Liquor Industry Requests Telangana Government to Settle Rs.3,100 Crore Dues, Proposes Price Increase to Counter Rising Costs
Read this also…OPPO K13 Set to Launch on April 21: Overpowered Where It Truly Counts
సిలికా బాండింగ్, 200% అధిక బాండింగ్ శక్తి, అద్భుతమైన భౌతిక, రసాయన లక్షణాల వల్ల, కే2 జెనాక్స్ సమకాలీన నిర్మాణ అవసరాలకు ఎంతో అనువైనది. ప్రీమియం Fe 500 & 500D ఉక్కుతో తయారైన ఈ టీఎంటీ బార్లు నిర్మాణంలో 20% వరకు ఉక్కు ఆదా చేయడానికి సహాయపడతాయి. ఈ ఉత్పత్తి BIS ప్రమాణాలను పాటిస్తూ స్థిరమైన నాణ్యతను అందిస్తుంది.