హైదరాబాద్‌లో MG SELECT డీలర్‌గా జయలక్ష్మి మోటార్స్..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 21, 2025: JSW MG మోటార్ ఇండియాకు చెందిన విలాసవంతమైన బ్రాండ్ ఛానెల్ MG SELECT భారతదేశ వ్యాప్తంగా 12 డీలర్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, ఫిబ్రవరి 21, 2025: JSW MG మోటార్ ఇండియాకు చెందిన విలాసవంతమైన బ్రాండ్ ఛానెల్ MG SELECT భారతదేశ వ్యాప్తంగా 12 డీలర్ భాగస్వాములను నియమించినట్లు ప్రకటించింది. ఈ కొత్త డీలర్లు 13 నగరాల్లో 14 MG SELECT ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి, ఆధునిక వినియోగదారులకు ప్రీమియం కార్ కొనుగోలు అనుభవాన్ని అందించనున్నారు.

ఈ భాగస్వామ్యంలో భాగంగా హైదరాబాద్‌లోని జయలక్ష్మి మోటార్స్ MG SELECT అధికారిక డీలర్‌గా ఎంపికైంది.

Read this also...MG SELECT Expands Luxury Automotive Retail with 12 New Dealer Partners Across India

ఇది కూడా చదవండి...360 వన్ అసెట్ గోల్డ్ ఈటీఎఫ్ ఆవిష్కరణ

ఈ సందర్భంగా మిలింద్ షా, యాక్టింగ్ హెడ్ – MG SELECT, JSW MG మోటార్ ఇండియా, మాట్లాడుతూ, “MG SELECT ఆధునిక వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది. అత్యున్నత కస్టమర్ అనుభవాన్ని అందించేందుకు వినూత్న మార్గాలను అన్వేషిస్తున్నాం. ఈ దిశగా, కొత్తగా నియమించిన మా డీలర్ భాగస్వాములు కీలక పాత్ర పోషించనున్నారు.” అని తెలిపారు.

జయలక్ష్మి మోటార్స్ భారతదేశంలోని ప్రముఖ ఆటోమొబైల్ డీలర్ నెట్‌వర్క్‌లలో ఒకటి. విలాసవంతమైన, ప్రీమియం బ్రాండ్‌లకు ఈ సంస్థ విశేష సేవలను అందిస్తోంది. పలు నగరాల్లో విస్తృత నెట్‌వర్క్ కలిగి ఉన్న జయలక్ష్మి మోటార్స్, కస్టమర్ సంతృప్తికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, సేల్స్ & ఆఫ్టర్-సేల్స్ సేవల్లో విశ్వసనీయతను అందిస్తోంది.

జయలక్ష్మి మోటార్స్ డైరెక్టర్ గౌతమ్ సాయి పి, JSW MG మోటార్ ఇండియాతో మా భాగస్వామ్యం ద్వారా ఆటోమొబైల్ రంగంలో ‘అందుబాటులో ఉన్న విలాసవంతమైన’ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్‌లో MG SELECT బ్రాండ్‌ను మరింత విస్తరించి, ఆధునిక వినియోగదారుల కోసం కార్ కొనుగోలు,యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మా తపన కొనసాగుతుంది.” అని పేర్కొన్నారు.

Read this also...360 ONE Asset Unveils Gold ETF for Indian Investors

Read this also...‘Sammelanam’ Web Series Review

Read this also…Sri Kapileswara Swamy Blesses Devotees on Suryaprabha Vahanam

MG SELECT అనేది ఆధునిక విలాసవంతమైన కస్టమర్ అనుభవాన్ని మేళవించే ఓ ప్రీమియం బ్రాండ్. ఇది స్థిరత, వినూత్నత, కళాత్మకతకు ప్రాధాన్యమిస్తూ, కొత్త తరం వినియోగదారులకు విలాసవంతమైన కార్లను మరింత చేరువ చేయడానికి సిద్దమవుతోంది. కస్టమర్లు ఇప్పటికే ప్రకటించిన MG Cyberster – ప్రపంచపు వేగవంతమైన MG రోడ్స్టర్, MG M9 – ప్రెసిడెన్షియల్ లిమోసిన్ మోడళ్లను ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు.

About Author