హోండా మోటార్‌సైకిల్ సంస్థ రహదారి భద్రతపై అవగాహన
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్గొండ, మార్చి 24, 2025: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,నల్గొండ, మార్చి 24, 2025: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు నడుం బిగించింది. ఇందులో భాగంగా నల్గొండలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. నవీన్ ఐటీఐ, ప్రభుత్వ ఐటీఐల్లో జరిగిన ఈ కార్యక్రమంలో 1,900 మందికి పైగా విద్యార్థులు, బోధన సిబ్బంది పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పొందారు.
ఈ సందర్భంగా HMSI ప్రతినిధులు మాట్లాడుతూ, చిన్న వయస్సులోనే రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడం ఎంతో అవసరమని, బాధ్యతాయుత రహదారి ప్రవర్తనతో ప్రమాదాలను తగ్గించుకోవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సురక్షిత రైడింగ్ పాఠాలు, ప్రమాద సూచనలు, గేమ్స్, క్విజ్‌లు, హెల్మెట్ ప్రాముఖ్యత, రైడింగ్ ట్రైనింగ్ మాడ్యూల్స్ నిర్వహించి విద్యార్థులకు ప్రాక్టికల్‌గా శిక్షణ ఇచ్చారు.
HMSI తన నిరంతర అవగాహన కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు తెలంగాణలో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు, ప్రజలకు రహదారి భద్రతపై శిక్షణ ఇచ్చినట్లు సంస్థ తెలిపింది. రోడ్డు ప్రమాద మరణాలను 2030 నాటికి సగానికి తగ్గించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని అనుసరిస్తూ, HMSI దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

E-Gurukul ద్వారా రహదారి భద్రతా శిక్షణ
HMSI ఇటీవలే E-Gurukul పేరిట డిజిటల్ రహదారి భద్రతా శిక్షణా వేదికను ప్రారంభించింది. 5-18 ఏళ్ల పిల్లలకు వయస్సుకు తగ్గట్టు ప్రత్యేక శిక్షణా మాడ్యూల్స్ అందుబాటులో ఉంచింది. తెలుగు సహా ఆరు భాషల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉండటంతో విద్యార్థులు సులభంగా నేర్చుకునేలా ఏర్పాటు చేశారు. http://egurukul.honda.hmsi.inద్వారా దీనిని యాక్సెస్ చేసుకోవచ్చు.
హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా చేపట్టిన ఈ రహదారి భద్రతా కార్యక్రమాలు భవిష్యత్‌లో మరింత విస్తృతంగా అమలు కానున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు.