సెర్టా పరుపుల ఫస్ట్ ఎక్స్లూజివ్ షోరూమ్ ఖాజాగూడలో ప్రారంభం..
వారాహి మీడియా డా కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 9,2025: ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రీమియం పరుపుల తయారీ సంస్థ సెర్టా (Serta), తెలంగాణలో తన తొలి ప్రత్యేక

వారాహి మీడియా డా కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, మే 9,2025: ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రీమియం పరుపుల తయారీ సంస్థ సెర్టా (Serta), తెలంగాణలో తన తొలి ప్రత్యేక షోరూమ్‌ను నగరంలోని ఖాజాగూడలో శుక్రవారం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని సెర్టా ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నితిన్ గుప్తా ఘనంగా ప్రారంభించారు.
కార్యక్రమంలో సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ ఎస్.కె. మల్హోత్రా, సేల్స్ హెడ్ ఉదయ్ దుబే, ప్రాంతీయ భాగస్వామి డెకర్ వరల్డ్ సిలెక్ట్ ప్రతినిధి అంకిత్ గోయల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖ ఆర్కిటెక్ట్లు, ఇంటీరియర్ డిజైనర్లు, పరిశ్రమ నిపుణులు హాజరయ్యారు.
₹200 కోట్ల టర్నోవర్ లక్ష్యం
ఈ సందర్భంగా నితిన్ గుప్తా మాట్లాడుతూ, “రాబోయే 12 నెలల్లో హైదరాబాద్‌లో ఐదు ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లను, రెండు సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా 10 స్టోర్లను ఏర్పాటు చేయాలన్నది మా లక్ష్యం. దేశవ్యాప్తంగా రెండు సంవత్సరాల్లో 100 స్టోర్లు నెలకొల్పాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న ₹100 కోట్ల టర్నోవర్‌ను ₹200 కోట్లకు పెంచాలన్నదే మా లక్ష్యం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి…శ్రీ మురళీ నాయక్ వీర మరణం – జాతికి తీరని లోటు
ఇది కూడా చదవండి…రూ. 28 కోట్లతో నీటి ఎద్దడి నివారణకు ప్రభుత్వం చర్యలు: మంత్రి పవన్ కళ్యాణ్
భారతదేశంలో అత్యంత చల్లని పరుపు – సెర్టా ఆర్క్టిక్
ఈ కొత్త షోరూమ్‌లో సెర్టా ఆర్క్టిక్ పేరుతో భారతదేశంలో అత్యంత చల్లదనం కలిగిన పరుపును పరిచయం చేశారు. ఇది 15 రెట్లు అధిక శీతలీకరణ సామర్థ్యం కలిగి ఉండగా, దీని ధర ₹2.78 లక్షల నుండి ₹4 లక్షల వరకు ఉంటుంది. కూల్‌టెక్స్ సిస్టమ్ అనే ప్రత్యేక టెక్నాలజీతో రూపొందించిన ఈ పరుపు త్వరగా నిద్రపోవడానికీ దోహదపడుతుందని అంకిత్ గోయల్ తెలిపారు.

ప్రీమియం ధర శ్రేణిలో విస్తృత రేంజ్
సెర్టా పరుపులు ₹30,000 నుండి ₹4 లక్షల మధ్య ధరలలో లభిస్తున్నాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సెర్టా 2012లో భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 35 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌లు, 200కి పైగా డీలర్ అవుట్‌లెట్లు ఏర్పాటు చేసింది.
లగ్జరీ మ్యాట్రెస్ విభాగంలో విస్తరణ లక్ష్యం
భారతదేశంలో లగ్జరీ మ్యాట్రెస్ మార్కెట్ విలువ ₹500 కోట్లుగా ఉండగా, అన్‌ఆర్గనైజ్డ్ విభాగం విలువ ₹15,000 కోట్లకు చేరింది. ఇది సంవత్సరానికి 20–25% వృద్ధిరేటుతో పెరుగుతోందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి…జమ్మూ కాశ్మీర్‌లో పలు చోట్ల డ్రోన్ల తో పాక్ దాడులు, తిప్పికొట్టిన భారత సైన్యం..
This is also read.. Lakshmi’s Salon & Academy Inaugurates First Branch in RK Puram, Kothapet, Hyderabad
హైదరాబాద్ మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి
“హైదరాబాద్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ప్రీమియం బ్రాండ్‌లకు విస్తృత అవకాశాలున్నాయి. ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహన, ఆదాయాల పెరుగుదల, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల విస్తరణ కారణంగా లగ్జరీ మ్యాట్రెస్ విభాగం వేగంగా ఎదుగుతోంది” అని ఉదయ్ దుబే చెప్పారు.
“1960ల్లో భారతీయులు నేలపై నిద్రించేవారు. 1980ల్లో ఆధునిక మాంద్యాల యుగం ప్రారంభమైంది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బూమ్ కారణంగా శ్రేష్ఠమైన పరుపుల డిమాండ్ పెరుగుతోంది” అని అంకిత్ గోయల్ తెలిపారు.