అందరికీ ఖచ్చితంగా నచ్చే సినిమా ‘యూఐ’..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: కన్నడ సినిమా సూపర్ స్టార్ ఉపేంద్ర తన’యూఐ’సినిమా కోసం నటుడిగా,దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు.

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 19,2024: కన్నడ సినిమా సూపర్ స్టార్ ఉపేంద్ర తన’యూఐ’సినిమా కోసం నటుడిగా,దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాని ఒకటి కాకుండా తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు ఉపేంద్ర ప్లాన్ చేస్తున్నాడు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ తోపాటు ట్రైలర్, పాటలు అభిమానుల్లో ఉత్కంఠను పెంచాయి. ‘యూఐ’ సినిమాలో ఏదో ప్రత్యేకత ఉందని ఆసక్తిని పెంచాయి. రేపు అంటే డిసెంబర్ 20వ తేదీన ‘యూఐ’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

భారీ ప్లాన్..
ఎనిమిదేళ్ల తర్వాత దర్శకుడు ఉపేంద్ర నటుడిగా, దర్శకుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. సినిమా విషయంలో ఆయన ప్లాన్ కూడా పెద్దగా, ప్రత్యేకంగా ఉండడానికి ఇదే కారణం. ఈ సినిమాను ఒకటి కాదు తొమ్మిది భాషల్లో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఐదు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయడమే కాకుండా విదేశీ భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇది ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ ,ఇటాలియన్ భాషలలో కూడా విడుదల కానుంది. ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్లాన్ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నేటితరంలో చిన్న,పెద్ద అనే తేడాలేకుండా అందరినీ ఆకట్టుకుంటుందని సినీ విమర్శకులు చెబుతున్నారు.
అద్భుత విజయాలు..
కన్నడ సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలను సాధిస్తున్న నేపథ్యంలో, “యూఐ” సినిమా కూడా ఎంత పెద్ద కలెక్షన్లు సాధిస్తుందోనని ట్రేడ్ గమనిస్తోంది.

ఈ సినిమా డబ్బింగ్ మూవీ అయినప్పటికీ, టాలీవుడ్‌లో ఉపేంద్రకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండడంతో, “యూఐ” సినిమాకు మంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఈ సినిమాతో మరోసారి వింటేజ్ ఉపేంద్ర దర్శకత్వాన్ని చూడబోతున్నామని, ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
చాలా కాలంగా డైరెక్షన్ కు దూరంగా ఉండి కేవలం హీరోగా మాత్రమే సినిమాలు చేస్తున్న ఉపేంద్ర, లాస్ట్ ఇయర్ “కబ్జా” చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే, ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన మరోసారి స్వీయదర్శకత్వంలో సినిమా చేస్తున్నారు.
“యూఐ” అనే ఈ సినిమా డిసెంబరు 20న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో భాగంగా, టాలీవుడ్ ఆడియెన్స్‌తో ముచ్చటిస్తూ, “యూఐ”తో సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తుమని, ఈ సినిమా క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా భిన్నంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.