డిఫరెంట్‌ మూవీ రివ్యూ & రేటింగ్:హార్ట్ బీట్ పెంచే థ్రిల్లర్…!

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 ,2025: వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిన ‘డిఫరెంట్’ చిత్రం ప్రేక్షకులను కొత్త

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 ,2025: వండర్ బ్రదర్స్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై తెరకెక్కిన ‘డిఫరెంట్’ చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. జి.ఎన్.నాష్, అజీజ్ చీమరువ, ప్రట్టి జో, సన, రాబర్ట్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు డ్రాగన్ (ఉదయ భాస్కర్) దర్శకత్వం వహించారు. లియోన్ ఆర్. భాస్కర్ సినిమాటోగ్రఫీ అందించగా, నిహల్ సంగీతం సమకూర్చారు. ఎన్.ఎస్.వి.డి. శంకరరావు నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 18న ఎస్‌కేఎమ్‌ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

కథలోకి వెళ్తే…
న్యూజిలాండ్‌లో వరుసగా యువతుల హత్యలు కలకలం రేపుతున్నాయి. ఓ సైకో కిల్లర్ పట్టలేక పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో బాబ్‌ (నితిన్ నాష్) అనే యువకుడు ఓ ఇంట్లో ఒంటరిగా ఉంటూ జీవితం సాగిస్తున్నాడు. అతని తల్లి (సన) ఓ గదిలో తాళం వేసుకొని మౌనంగా ఉంటుంది. ఊహించని పరిస్థితుల్లో ముగ్గురు అమ్మాయిలు బాబ్ ఇంట్లోకి చొరబడి అతనిని హత్య చేయాలని ప్రయత్నిస్తారు. అసలు బాబ్ ఎవరు? అమ్మ గదిలో ఎందుకు ఉంటోంది? ఆ ముగ్గురు అమ్మాయిలు ఎవరు? హత్యల వెనుక నిజంగా ఎవరు ఉన్నారు? అన్నదే మిగతా కథ.

Read this also…“Different” Review: A Gripping Murder Mystery with Solid Performances

Read this also…CREDAI Deepens Focus on Sustainability and Skilling; Shekhar G. Patel Takes Charge as President (2025–27)

నటీనటుల పరంగా…
హీరో నితిన్ నాష్ తన పాత్రలో జీవించాడు. ఒంటరితనాన్ని, భయాన్ని తన నటన ద్వారా బాగా వ్యక్తపరిచాడు. సన తల్లి పాత్రకు న్యాయం చేయగా, ముగ్గురు యువతులుగా నటించిన నటీమణులు కూడా తమ పాత్రలను సమర్థంగా పోషించారు.

సాంకేతికంగా…
ఒకే ఇంట్లో సాగిన సినిమా అయినప్పటికీ, దర్శకుడు డ్రాగన్ ఆసక్తికరంగా కథను అల్లారు. ప్రతి సన్నివేశాన్ని గట్టిగా మెయింటెయిన్‌ చేస్తూ, థ్రిల్‌ను పటిష్టంగా నెరవేర్చారు. కెమెరా పనితనం బాగా వర్కౌట్ అయింది. లైటింగ్, ఫ్రేమింగ్‌ విజువల్‌గా ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్‌ కూడా టెంపోను నిలబెట్టింది. నిహాల్‌ సంగీతం సినిమాకు మెరుగైన మూడ్‌ అందించింది.

Read this also…IndiGoStretch: Premium Travel Now on Bengaluru–Mumbai Route from May 1st

Read this also…Tata Elxsi Secures €50 Million Engineering Deal with Leading European Automotive OEM

మొత్తంగా…
విభిన్న కథ, నిశ్శబ్దాన్ని నేపథ్యంగా చేసుకొని థ్రిల్‌ను అల్లిన ‘డిఫరెంట్’ సినిమా థ్రిల్లర్ ప్రేమికులకు కొత్త అనుభూతినిస్తుంది. థియేటర్లకు వెళ్లి ఈ ప్రయోగాత్మక థ్రిల్లర్‌ను ఒకసారి చూసి రావచ్చు.

వారాహి మీడియా డాట్ కామ్ రేటింగ్: 3/5

About Author