విజయవంతంగా ముగిసిన క్రిమ్సన్ ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్..

0

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 5,2024: క్రిమ్సన్ ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ – సీజన్ 1, ఆగస్టు 2 నుంచి 4, 2024 వరకు, సెయింట్ మైఖేల్స్ స్కూల్, అల్వాల్,

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, ఆగస్టు 5,2024: క్రిమ్సన్ ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ – సీజన్ 1, ఆగస్టు 2 నుంచి 4, 2024 వరకు, సెయింట్ మైఖేల్స్ స్కూల్, అల్వాల్, హైదరాబాద్‌లో జరిగింది. తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ మద్దతుతో జరిగిన ఈ ఈవెంట్‌లో నగరంలోని 17 పాఠశాలల నుంచి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గేమ్ నాకౌట్-విజేతలు రౌండ్ 1 నుండి క్వార్టర్-ఫైనల్స్, సెమీస్, ఆపై ఫైనల్స్‌కు చేరుకొన్నాయి. మూడు రోజుల పాటు మొత్తం 19 మ్యాచ్‌లు జరిగాయి.

అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించిన భారత జాతీయ బాస్కెట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, సెయింట్ మైకేల్స్ పాఠశాల పూర్వ విద్యార్థి, తెలంగాణ జాతీయ జట్టు మాజీ కెప్టెన్ నాథన్ అబ్రహం, భారత సీనియర్ పురుషుల బాస్కెట్‌బాల్ జట్టు మాజీ ప్రధాన కోచ్ ,తమిళనాడు సీనియర్ పురుషుల జట్టు, యంజి యూనివర్సిటీ మహిళల జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ సి.వి. సన్నీ తదితరులు టోర్నమెంట్‌కు హాజరైన ముఖ్యమైన అతిథులలో ఉన్నారు.

భారతదేశంలోని ప్రముఖ పాఠశాల కార్యకలాపాల ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి అయిన క్రిమ్సన్ దాని అన్ని భౌగోళిక ప్రాంతాలలో విస్తృత శ్రేణి క్రీడలను పెంపొందించడానికి ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను ప్రారంభించింది. ఈ ఛాంపియన్‌షిప్ లో డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఛాంపియన్‌గా నిలవగా, ఆర్మీ పబ్లిక్ స్కూల్ రన్నరప్‌గా నిలిచింది. ముగింపు కార్యక్రమంలో విజేత జట్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీ, పతకాలను అందుకుంది.

“క్రిమ్సన్ ఇంటర్-స్కూల్ బాస్కెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ జట్టు స్ఫూర్తిని బలోపేతం చేసింది. మా విద్యార్థులలో బాస్కెట్‌బాల్ పట్ల ప్రగాఢమైన అభిరుచిని రేకెత్తిస్తూ ఆదర్శవంతమైన క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహించింది. పోటీతత్వ అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా ఛాంపియన్‌షిప్ విద్యార్థుల శారీరక ఆరోగ్యానికి మద్దతునిచ్చింది, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది. విద్యార్థుల శ్రేయస్సు, విద్యావిషయక విజయానికి క్రీడలు ఎలా అంతర్లీనంగా ఉంటాయో చాంపియన్‌షిప్ ప్రదర్శించింది” అని క్రిమ్సన్ ఎడ్యుకేషన్ సిఈవో హుసియన్ దోహద్వాల్లా వ్యాఖ్యానించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *