అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ తో గిఫ్టింగ్ సంస్కృతి: దశాబ్దం ఆనంద సంబరం..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2024: అమేజాన్ పే, తమ వినూత్న బహుమతి ఆఫర్‌లతో కస్టమర్లకు ఆనందాన్ని అందించే దశాబ్దపు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 7,2024: అమేజాన్ పే, తమ వినూత్న బహుమతి ఆఫర్‌లతో కస్టమర్లకు ఆనందాన్ని అందించే దశాబ్దపు సంబరాల్లో భాగంగా, భారతదేశంలోని కస్టమర్లకు 1 బిలియన్ కంటే ఎక్కువ గిఫ్ట్ కార్డ్స్‌ను విజయవంతంగా అందించటం గౌరవంగా ప్రకటించింది.
2014 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైనప్పటి నుంచి ఈ కార్డ్స్ కస్టమర్లకు స్థిరమైన విలువను అందిస్తూ, ప్రతి సంవత్సరానూ రెండంకెల వృద్ధిని సాధించాయి.
అమేజాన్ పే ప్రస్తుతం, అమేజాన్ షాపింగ్ వోచర్స్, అమేజాన్ ఫ్రెష్ వోచర్స్, అమేజాన్ ప్రైమ్ వోచర్స్,కొత్త అమేజాన్ గోల్డ్ వోచర్స్ వంటి విస్తృత గిఫ్ట్ కార్డ్ ఎంపికలను అందిస్తోంది.
ఇవి తమ కస్టమర్లకు సులభంగా అందించే బహుమతుల ఎంపికలు రూపొందించబడ్డాయి. ఈ ఆఫరింగ్స్ మరింత విస్తృత శ్రేణి ప్రాధాన్యతలను అందిస్తూ, ప్రతి ఒక్కరి కోసం అనుకూలమైన ఎంపికను అందిస్తాయి.
భారతదేశంలో 400 మిలియన్ కి పైగా గేమర్స్ (ఆధారం: ఇన్వెస్ట్ ఇండియా) ఉన్న నేపధ్యంలో, అమేజాన్ పే గేమింగ్ గిఫ్ట్ కార్డ్స్ ను కూడా పరిచయం చేసింది, ఇది ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌లు, ముఖ్యంగా యాపిల్ యాప్ స్టోర్, వలోరంట్, యూనిపిన్, స్టీమ్, ప్లే స్టేషన్ వంటి వాటితో పనిచేస్తోంది.
ఈ కొత్త గిఫ్ట్ కార్డ్స్ వేగంగా ప్రసిద్ధి చెందాయి, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్‌తో పోలిస్తే నెలవారీ సేల్స్ లో 10% పెరుగుదల చొప్పున ప్రోత్సహించడం జరిగింది.
అమేజాన్ పే, వారి 10వ వార్షికోత్సవం సందర్భంగా, తమ కస్టమర్లకు కృతజ్ఞతలు తెలపడం ద్వారా, గిఫ్ట్ కార్డ్స్ ,శక్తిని,వాటి సౌలభ్యాన్ని వివరిస్తుంది.
డైరెక్టర్ – స్టోర్డ్ వేల్యూ & గిఫ్టింగ్, నేహా గుప్తా మహాత్మ అన్నారు, “బిలియన్ గిఫ్ట్ కార్డ్స్‌ను అందించడంతో, లక్షలాది కస్టమర్లకు సులభంగా, అర్థవంతమైన మార్గంలో బహుమతులు ఇవ్వడానికి సహాయం చేయటం మనకెంతో గౌరవంగా ఉంది.
2024లో, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో గిఫ్ట్ కార్డ్ కొనుగోళ్లలో 40% పెరుగుదలను చూడటం, మా కస్టమర్ల నుంచి ఎక్కువ ప్రేమను,నమ్మకాన్ని పొందటం ప్రతిబింబించేది.”
అంతేకాక, వినూత్నమైన, వ్యక్తిగతమైన గిఫ్ట్ కార్డ్స్ అందించడం ద్వారా, అమేజాన్ పే వినియోగదారుల కోసం అత్యంత ప్రత్యేకమైన బహుమతుల ఎంపికలను అందించడం కొనసాగిస్తోంది.
దీనికి ఉపకరించేందుకు, కళాకారుడు అలీషియా సౌజా డిజైన్ చేసిన యానిమేటెడ్ ఆప్షన్లు ,ప్రాంతీయ భాషా కార్డ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలోని గిఫ్ట్ కార్డ్ మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్, డిజిటల్ బహుమాన విప్లవంలో ముందంజలో నిలిచాయి.
2032 నాటికి, భారతదేశ గిఫ్ట్ కార్డ్ మార్కెట్ $57.27 బిలియన్ విలువకు చేరుకుంటుందని అంచనా వేయబడింది (ఆధారం: క్రెడెన్స్ రీసెర్చ్). ఈ వృద్ధిలో, అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ కీలకమైన భాగస్వామిగా నిలిచాయి.