రూ. 600 కోట్ల ఐపీవో కోసం డీఆర్‌హెచ్‌పీ సమర్పించిన ఏరిస్ఇన్‌ఫ్రా సొల్యూషన్స్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 14,2024:ఏరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఎస్ఎల్) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించేందుకు

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఆగస్టు 14,2024:ఏరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఎస్ఎల్) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ. 600 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. సంస్థ ప్రమోటర్లలలో ఫార్మ్‌ఈజీ సీఈవో సిద్ధార్థ్ షా ఒకరు కాగా రోనక్ కిషోర్ మోర్బియా, భవిక్ జయేష్ ఖారా, జాస్మిన్ భాస్కర్ షా, ప్రియాంక భాస్కర్ షా, భాస్కర్ షా, యాస్పైర్ ఫ్యామిలీ ట్రస్ట్, ప్రియాంకా షా ఫ్యామిలీ ట్రస్టులు కూడా ప్రమోటర్లుగా ఉన్నాయి.

నిర్మాణ మెటీరియల్స్ కొనుగోలు ప్రక్రియను సరళతరం, డిజిటైజ్ చేయడానికి సంబంధించి కంపెనీ బీ2బీ (బిజినెస్ టు బిజినెస్) టెక్నాలజీ ఆధారిత కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా రూ. 2 ముఖ విలువ గల షేర్లను తాజాగా జారీ చేయడం ద్వారా రూ. 600 కోట్ల వరకు నిధులు సమీకరించాలని కంపెనీ భావిస్తోంది.

ఈ నిధులను సుమారు రూ. 204.60 కోట్ల రుణాలను తిరిగి చెల్లించేందుకు, రూ. 177 కోట్ల మేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, అనుబంధ సంస్థ బిల్డ్‌మెక్స్-ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు, దానికి రూ. 48 కోట్ల మేర వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చేందుకు, రూ. 20.40 కోట్లతో అనుబంధ సంస్థ ఏరిస్‌యూనిటర్న్ రీ సొల్యూషన్స్‌లో ప్రస్తుత షేర్‌హోల్డర్ల నుంచి పాక్షికంగా వాటాలను కొనుగోలు చేసేందుకు, మిగతాది కార్పొరేట్ అవసరాలు, ఇతరత్రా సంస్థల కొనుగోలు కోసం కంపెనీ వినియోగించుకోనుంది.

ఈ ఇష్యూకి జేఎం ఫైనాన్షియల్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్ (గతంలో ఎడెల్వీజ్ సెక్యూరిటీస్) సంస్థలు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.

About Author