ఇండియా తయారీ ఫోన్‌పే స్మార్ట్‌స్పీకర్ ఆవిష్కరణ..
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 5,2025: డిజిటల్ లావాదేవీల్లో ప్రముఖంగా నిలిచిన ఫోన్‌పే తన కొత్త తరం ‘మేడిన్ ఇండియా’ స్మార్ట్‌స్పీకర్‌ను ఆవిష్కరించింది. ఈ నూతన వర్షన్
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, మే 5,2025: డిజిటల్ లావాదేవీల్లో ప్రముఖంగా నిలిచిన ఫోన్‌పే తన కొత్త తరం ‘మేడిన్ ఇండియా’ స్మార్ట్‌స్పీకర్‌ను ఆవిష్కరించింది. ఈ నూతన వర్షన్ 4జీ నెట్‌వర్క్, వేగవంతమైన ఛార్జింగ్ (75 నిమిషాల్లో పూర్తి ఛార్జ్), ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్, అధిక శబ్దమున్న ప్రదేశాల్లోనూ స్పష్టంగా వినిపించే ఆడియోతో లభిస్తుంది.
Also read this…PhonePe Unveils its Made in India SmartSpeaker
ఇది కూడా చదవండి…తెలంగాణలో ₹1,500 కోట్లతో బయోగ్యాస్ విప్లవం: EcoMax, Biovest, Spantech మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యం
2022లో పరిచయం చేసిన మొదటి స్మార్ట్‌స్పీకర్‌కు బేస్‌గా తీసుకుని రూపొందించిన ఈ మోడల్ 21 భాషల్లో పనిచేస్తుంది. ప్రముఖ సినీ నటుల స్వరాలతో వస్తున్న ఈ ఉపకరణం, చెల్లింపుల విజయాన్ని తక్షణంగా వాయిస్ నోటిఫికేషన్ రూపంలో తెలుపుతుంది. తద్వారా వ్యాపారులు ఎస్‌ఎంఎస్ లేదా యాప్ చెక్ చేయకుండానే తేలికగా పేమెంట్లను తెలుసుకోవచ్చు.

ఈ సందర్భంగా ఫోన్‌పే మర్చెంట్ బిజినెస్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ యువరాజ్ సింగ్ శెఖావత్ మాట్లాడుతూ, “భారత మార్కెట్‌కు అనుగుణంగా తయారు చేసిన ఈ స్మార్ట్‌స్పీకర్‌లు, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనూ వ్యాపారులకు ఆర్థిక సేవలకు ప్రాప్తిని సులభతరం చేస్తాయి. భారతీయ తయారీదారులను డిజిటల్ పరివర్తనలో భాగస్వాములుగా చేస్తూ దేశీయ ఆవిష్కరణను ప్రోత్సహిస్తాయి” అని తెలిపారు.
Also read this…Telangana Launches ₹1,500 Cr Green Drive with Biogas Innovation via Biovest-Spantech-EcoMax Alliance
Also read this…Telangana Launches ₹1,500 Cr Green Drive with Biogas Innovation via Biovest-Spantech-EcoMax Alliance
ఫోన్‌పే ప్రస్తుతం దేశవ్యాప్తంగా 60 కోట్లకుపైగా యూజర్లు, 4 కోట్లకుపైగా వ్యాపారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. రోజూ సగటున 33 కోట్ల పేమెంట్లు ప్రాసెస్ చేస్తోంది. ఈ సంస్థ ‘పిన్‌కోడ్’ వంటి హైపర్ లోకల్ ఈ-కామర్స్, ‘ఇండస్ యాప్ స్టోర్’ వంటి దేశీయ యాప్ మార్కెట్‌లలోనూ తన సేవల్ని విస్తరిస్తోంది.