సైబర్‌సిటీ బిల్డర్స్ అందించిన విలాసవంతమైన “విల్లా వెర్డే” ప్రాజెక్ట్ గ్రాండ్‌గా ప్రారంభం
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 14,2025: హైటెక్ సిటీలో గ్రీన్ హిల్స్ రోడ్ వద్ద సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ రూపొందించిన అత్యాధునిక విల్లా ప్రాజెక్ట్ “విల్లా వెర్డే” ను

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,ఏప్రిల్ 14,2025: హైటెక్ సిటీలో గ్రీన్ హిల్స్ రోడ్ వద్ద సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ రూపొందించిన అత్యాధునిక విల్లా ప్రాజెక్ట్ “విల్లా వెర్డే” ను ఏప్రిల్ 13, 2025న అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, బిజినెస్ లీడర్లు, సెలబ్రిటీలు మరియు సైబర్‌సిటీ ఫ్యామిలీ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రసిద్ధ ఇంటీరియర్ డిజైనర్, ‘ది చార్కోల్ ప్రాజెక్ట్’ వ్యవస్థాపకురాలు సుసానే ఖాన్ ఈ ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసి, విల్లా వెర్డేతో తమ డిజైన్ భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ భాగస్వామ్యంతో, విల్లా వెర్డే కోసం ప్రత్యేకంగా రూపొందించిన, క్లాస్,ఎలిగెన్స్‌తో కూడిన ఇంటీరియర్ డిజైన్ ప్యాకేజీలు అందించబడతాయి.
విల్లా వెర్డే విశేషాలు:

13.4 ఎకరాల్లో అభివృద్ధి చేసిన ఈ ప్రాజెక్ట్‌లో 89 విల్లాలు ఉన్నాయి. ప్రతి విల్లా 300 నుంచి 440 గజాల విస్తీర్ణంలో ఉంటుంది.
- 100 అడుగుల గేటు ఆర్చ్,100 అడుగుల రోడ్డు ఈ ప్రాజెక్ట్‌కు ప్రత్యేక ఆకర్షణ.
- ప్రతి విల్లాకు కనీసం 3 కార్ పార్కింగ్ సౌకర్యం
- టెరస్‌పై స్విమ్ స్పా,
- ఇంటర్నల్ ఎలివేటర్,
- RainMaxx నీటి నిర్వహణ టెక్నాలజీ,
- IGBC గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్,
- 12 అడుగుల వెడల్పైన డెక్స్,
- బయోఫిలిక్ డిజైన్,
- ప్రత్యేక ప్యారామెట్రిక్ క్లబ్‌హౌస్,
- 15+ ఇండోర్, 35+ అవుట్డోర్ అమీనిటీస్,
- 1.4 ఎకరాల సెంట్రల్ ఓపెన్ స్పేస్ లాంటి ఆధునిక, లగ్జరీ సదుపాయాలతో ఈ ప్రాజెక్ట్ నిండింది.
ఈవెంట్ హైలైట్స్:
ఈ కార్యక్రమంలో గ్రాండ్ వీడియో టూర్, స్కేల్ మోడల్ రివీల్, సైబర్‌సిటీ 20 ఏళ్ల ప్రయాణాన్ని చూపించే స్పెషల్ వీడియో రీల్‌ను ప్రదర్శించారు. ఈ ఈవెంట్, అద్భుతమైన లగ్జరీకి,సుస్థిర జీవనశైలికి ప్రాతినిధ్యం వహించింది.

సైబర్‌సిటీ బిల్డర్స్ 20 ఏళ్ల ఘనయాత్ర:
2005లో స్థాపించబడిన సైబర్ సిటీ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గత 20 ఏళ్లుగా హైదరాబాద్‌లో 7500+ కుటుంబాలకు గ్రీన్ బిల్డింగ్‌లతో కూడిన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు అందిస్తోంది. 2025లో సైబర్‌సిటీ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. విల్లా వెర్డేతో పాటు మరో రెండు అద్భుత ప్రాజెక్టులు కూడా ఈ సంవత్సరం ప్రారంభించబోతున్నాయి.