ప్యూర్ సంస్థ నుంచి విప్లవాత్మక PuREPower ఉత్పత్తుల ఆవిష్కరణ..

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, 25,2025: ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ విద్యుత్‌ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తున్న ప్యూర్‌ (PURE) సంస్థ భారతదేశం డీకార్బనైజేషన్‌

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, హైదరాబాద్‌, 25,2025: ఎలక్ట్రిక్ మొబిలిటీ, స్వచ్ఛ విద్యుత్‌ పరివర్తనలో కీలక పాత్ర పోషిస్తున్న ప్యూర్‌ (PURE) సంస్థ భారతదేశం డీకార్బనైజేషన్‌ లక్ష్యాలను వేగవంతం చేసేందుకు కీలక అడుగు వేసింది. ‘PuREPower’ పేరిట విప్లవాత్మక ఎనర్జీ స్టోరేజ్‌ ఉత్పత్తులను ఆవిష్కరించింది. ప్యూర్‌ సంస్థ దేశంలో ఎనర్జీ స్టోరేజ్‌ విభాగంలోకి అడుగుపెట్టడంతోపాటు, పునరుత్పాదక శక్తి వినియోగాన్ని విస్తృతం చేయడంపై దృష్టి సారించింది.

Read this also…Laisha Utsav Celebrates Women’s Empowerment with Grandeur

ఇది కూడా చదవండి..ఘనంగా లైషా ఉత్సవ్ – మహిళా శక్తికి గౌరవ వేదిక

గృహాల నుంచి గ్రిడ్‌ వరకు విస్తరించే ఉత్పత్తులు
PuREPower శ్రేణిలో PuREPower Home, PuREPower Commercial, త్వరలోనే లాంచ్‌ కానున్న PuREPower Grid లాంటి విభాగాలు ఉన్నాయి. ఇవి విశ్వసనీయమైన, విస్తరించతగిన, పర్యావరణహితమైన ఎనర్జీ స్టోరేజ్‌ అవసరాలను తీర్చనున్నాయి. ప్రత్యేకంగా గృహ వినియోగదారుల కోసం రూపొందించిన PuREPower Home రూ.74,999 (ఎక్స్‌-ఫ్యాక్టరీ) ప్రారంభ ధర వద్ద లభిస్తోంది. అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌ సమన్వయంతో రూపొందించిన ఈ ఉత్పత్తులు డీకార్బనైజేషన్‌ లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడంలో తోడ్పడతాయి.

ప్యూర్‌ సంస్థ వచ్చే 18 నెలల్లో దేశవ్యాప్తంగా 300కి పైగా టచ్‌పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పెద్ద ఎత్తున డీలర్‌/డిస్ట్రిబ్యూటర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసి, ఆధునిక ఎనర్జీ స్టోరేజ్‌ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానుంది. వినియోగదారులకు మెరుగైన సాంకేతిక, వాణిజ్యపరమైన మద్దతును అందించేందుకు ఈ విస్తరణ ఉపయోగపడనుంది.

గ్రిడ్‌ స్థిరీకరణకు PuREPower Grid‌
భారతదేశంలో పునరుత్పాదక శక్తి వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, 2026 నాటికి ‘PuREPower Grid’ పరిచయం కానుంది. ఇది 4MWh సామర్థ్యం కలిగిన కంటైనర్‌ ఆధారిత ఎనర్జీ స్టోరేజ్‌ యూనిట్లతో గ్రిడ్‌ స్థిరీకరణలో కీలక పాత్ర పోషించనుంది. పారిశ్రామిక వినియోగదారులు, మైక్రో-గ్రిడ్‌లు, ప్రభుత్వ యుటిలిటీలకు ఇది కీలక పరిష్కారంగా మారనుంది.

వాణిజ్య రంగానికి ప్రత్యేకంగా PuREPower Commercial
వ్యాపార అవసరాలకు అనుగుణంగా 25KVA నుంచి 100KVA సామర్థ్యం కలిగిన ‘PuREPower Commercial’ విభాగాన్ని ప్యూర్‌ అందుబాటులోకి తెచ్చింది. హెల్త్‌కేర్‌, టెలికం టవర్లు, కార్యాలయాలు, రిటైల్‌ కాంప్లెక్స్‌లకు ఇది అనువుగా ఉండనుంది. డీజిల్‌ జనరేటర్లపై ఆధారపడకుండా, సుస్థిర విద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఈ ఉత్పత్తి ఉపయోగపడనుంది.

ఇది కూడా చదవండి..ఆన్‌లైన్ యాడ్స్‌పై డిజిటల్ పన్ను రద్దు – ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి!

Read this also…Major Factors Contributing to Rupee Depreciation

2030 నాటికి భారతదేశం 500 GW పునరుత్పాదక విద్యుత్‌ సామర్థ్యాన్ని అధిగమించనున్న నేపథ్యంలో, విద్యుత్‌ సరఫరా-డిమాండ్‌ మధ్య సమతౌల్యం పాటించేందుకు PuREPower ఉత్పత్తులు కీలకంగా మారనున్నాయి. “PuREPower ఉత్పత్తులు భారతదేశ డీకార్బనైజేషన్‌ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో నూతన మార్గాన్ని చూపనున్నాయి. విద్యుత్‌ నిల్వలో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం ద్వారా దేశంలో పునరుత్పాదక విద్యుత్‌ వినియోగాన్ని మరింత పెంచేందుకు ఈ ఉత్పత్తులు దోహదపడతాయి” అని ప్యూర్‌ వ్యవస్థాపకుడు, ఎండీ డాక్టర్‌ నిశాంత్‌ దొంగారి తెలిపారు.

ప్యూర్‌ సంస్థ అత్యాధునిక బ్యాటరీ టెక్నాలజీ, పవర్‌ ఎలక్ట్రానిక్స్‌, సోలార్‌ కంట్రోల్‌, ఏఐ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని సమన్వయించి PuREPower ఉత్పత్తులను రూపొందించింది. విద్యుత్‌ నిల్వ ఆవిష్కరణల్లో కొత్త ఒరవడిని సృష్టించడానికి, ‘డిజైన్‌ అండ్‌ మేక్‌ ఇన్‌ ఇండియా’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఈ ఉత్పత్తులు తోడ్పడనున్నాయి.

About Author