గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రజల విశ్వాసానికి మరోసారి మద్దతు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 8,2025: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ధృఢసంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన
![](https://varahimedia.com/wp-content/uploads/2025/02/NarendraModi.jpg)
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్ ,ఫిబ్రవరి 8,2025: 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే ధృఢసంకల్పంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలన సాగిస్తున్నారు. సంక్షేమాన్ని దెబ్బతీయకుండా, అభివృద్ధిని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లే విధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నూతన జవసత్వాలు అందిస్తున్నారు.
దేశ రాజధాని ఢిల్లీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుండగా, ఈ తరుణంలో జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కూటమి ఘనవిజయం సాధించడం ప్రజాస్వామ్యంలో స్వాగతించదగ్గ పరిణామం.
డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా దేశ రాజధానిలో సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ సిద్ధమైంది. ఢిల్లీ అభివృద్ధి కోసం, ప్రజల శ్రేయస్సు కోసం రూపొందించిన వికసిత సంకల్ప పత్రం ప్రజల విశ్వాసాన్ని చూరగొంది.
![](http://varahimedia.com/wp-content/uploads/2025/02/NarendraModi.jpg)
ఈ విజయంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పై ప్రజల విశ్వాసం మరింత బలపడింది. పారదర్శక పాలన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేసే బీజేపీ పాలనపై ఢిల్లీ ప్రజలు నమ్మకాన్ని వ్యక్తపరిచారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ రాజధాని ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని, సమర్థవంతమైన రాజకీయ వ్యూహంతో ముందుకు నడిపారు. కేంద్ర ఆరోగ్య శాఖామాత్యులు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డా కూటమిని విజయపథంలో నడిపేందుకు కీలక పాత్ర పోషించారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో సాధించిన విజయంలో ప్రధాన పాత్ర వహించిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి, బీజేపీ జాతీయ అధ్యక్షులు జె.పి. నడ్డాకి, బీజేపీ నేతలకు, మిత్రపక్ష నాయకులకు హృదయపూర్వక అభినందనలు.