గృహ భద్రతపై ఆధునిక సాంకేతికతకు 53% మంది ప్రాధాన్యత – గోద్రేజ్ ‘హ్యాపీనెస్ సర్వే’

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 27, 2025: జాతీయ పర్యాటక దినోత్సవానికి ముందుగా, గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ నిర్వహించిన

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్,హైదరాబాద్, జనవరి 27, 2025: జాతీయ పర్యాటక దినోత్సవానికి ముందుగా, గోద్రేజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ నిర్వహించిన హ్యాపీనెస్ సర్వేలో 53% మంది స్పందనదారులు గృహ భద్రతా పరిష్కారాలలో అధునాతన సాంకేతికతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడైంది. ప్రయాణాల సమయంలో భద్రత,మనశ్శాంతిని కలిగించే స్మార్ట్ సెక్యూరిటీ పద్ధతులపై వినియోగదారుల అభిరుచులు పెరుగుతున్నాయని ఈ సర్వే చెబుతుంది.

2027 నాటికి భారత్ మూడవ అతిపెద్ద దేశీయ పర్యాటక మార్కెట్‌గా ఎదగనుందని అంచనా. 2024లో పర్యాటక రంగం ద్వారా ₹25,010 కోట్లకు పైగా విదేశీ మారకద్రవ్య ఆదాయం సాధించింది. ఈ క్రమంలో, ప్రయాణీకులు తమ ఇళ్ల భద్రతపై ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు. సర్వేలో 50% మంది వినియోగదారులు భద్రతా వ్యవస్థల సౌలభ్యాన్ని, 44% మంది వాటి విశ్వసనీయతను ముఖ్యంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.

సర్వే ఫలితాలపై గోద్రేజ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ బిజినెస్ హెడ్ శ్రీ పుష్కర్ గోఖలే మాట్లాడుతూ, “ప్రస్తుతం వినియోగదారులు స్మార్ట్,అధునాతన సాంకేతిక పరిష్కారాలను ఎన్నుకుంటున్నారు. ఇవి భౌతిక రక్షణతో పాటు ప్రయాణాల సమయంలో మనశ్శాంతిని కూడా అందిస్తున్నాయి. గోద్రేజ్‌లో, మేము వినియోగదారుల భద్రతా అవసరాలను తీర్చే అధునాతన పరిష్కారాలను అందించేందుకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నాము” అని చెప్పారు.

జాతీయ పర్యాటక దినోత్సవం భారత దేశ సాంస్కృతిక, సహజ వారసత్వాన్ని గుర్తుచేయడమే కాకుండా ఆధునిక జీవనశైలిలో ప్రయాణ ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. దేశీయ, అంతర్జాతీయ పర్యటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రయాణాల్లో గృహ భద్రతపై మరింత శ్రద్ధ పెట్టడం అవసరం.

గోద్రేజ్ గ్రూప్ సెక్యూరిటీ విభాగం, రిమోట్ పర్యవేక్షణ, అలర్ట్ సదుపాయాలతో కూడిన ఏఐ ఆధారిత నిఘా కెమెరాలు, ఇంట్రూషన్ అలారమ్‌లు, వీడియో డోర్‌ఫోన్‌లు వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులను అందిస్తూ, వినియోగదారులకు అధిక స్థాయి భద్రతను కల్పిస్తోంది.

ఈ సర్వే దేశంలోని 12 ప్రధాన నగరాల్లోని 2,400 మంది నుంచి అభిప్రాయాలు సేకరించి, వినియోగదారుల భద్రతా అవసరాలపై సమగ్ర దృక్పథాన్ని అందించింది.

About Author