పోలీస్ లకు లేఖ రాసిన మోహన్ బాబు భార్య నిర్మలా మోహన్ బాబు
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లివారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి
వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, డిసెంబర్ 17,2024: డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్‌ని బయట పెట్టి, విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది.
నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాడు. నా చిన్న కొడుకైన మనోజ్‌కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉన్నది.
నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు.
ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా ‘మేమిక్కడ పని చేయలేమని’, వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.