మొదటి సన్ మూన్ క్రోనోగ్రాఫ్‌ల తో ‘ఆఫ్టర్‌అవర్స్’ ప్రారంభించిన  ఫాస్ట్రాక్

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, 25 అక్టోబర్ ,2024: భారతదేశంలో యువతలో అత్యధికంగా అభిమానించే వాచ్ బ్రాండ్ ఫాస్ట్రాక్, పండుగ సీజన్‌కు తమ

వారాహి మీడియా డాట్ కామ్ ఆన్ లైన్ న్యూస్, 25 అక్టోబర్ ,2024: భారతదేశంలో యువతలో అత్యధికంగా అభిమానించే వాచ్ బ్రాండ్ ఫాస్ట్రాక్, పండుగ సీజన్‌కు తమ తాజా “ఆఫ్టర్ అవర్స్” ప్రచారంతో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. ఆఫ్టర్ అవర్స్ ఆహ్లాదాన్ని అందిపుచ్చడానికి ఫాస్ట్రాక్ విడుదల చేసిన ఓపులెన్స్ కలెక్షన్ – చిక్ పార్టీ వేరియంట్లతో టిక్కింగ్ కొనసాగించాలని కోరుకునే వారికి ప్రత్యేకంగా రూపుదిద్దుకుంది.

ఈ కలెక్షన్‌లో పురుషుల కోసం ఫాస్ట్రాక్ తొలిసారిగా సన్-మూన్ క్రోనోగ్రాఫ్ వంటి ప్రత్యేకమైన ఫీచర్‌తో, పురుషులు,మహిళలకు అనువైన ఆకర్షణీయమైన పలు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన డిజైన్ పగలు-రాత్రి మార్పును సజావుగా అనుసరిస్తుంది.

ఉత్సవాలు ముగిశాక మొదలయ్యే నిజమైన పార్టీలకు ఈ ప్రచారం ప్రత్యేకమైన క్షణాలను అందిస్తుంది. కుటుంబ సంప్రదాయాలు అందరికీ ఇష్టమే, కానీ నిజంగా ఆనందించేది మీ బృందం మాత్రమే ఉన్నప్పుడు, సంగీతం ప్లే అవుతూనే ఉంది. ఆఫ్టర్ పార్టీ మొదలవుతుంది.

‘ఆఫ్టర్ అవర్స్’ ప్రచారం అర్థరాత్రి మరపురాని క్షణాలను – ఆకస్మిక నృత్యాలు, లోతైన సంభాషణలు, రాత్రి ముగిసిన తర్వాత కూడా మనలో కలిసిపోయే ఆ మధుర జ్ఞాపకాలను ప్రోత్సహిస్తుంది. ఆఫ్టర్ అవర్స్ అనుభూతిని స్వీకరించి ఆనందాన్ని సృష్టించే ఆ క్షణాలను వేడుకగా మార్చుతుంది.

మహిళల కోసం, ఈ కలెక్షన్‌లో బ్రేస్లెట్ స్టైల్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కుటుంబ ఈవెంట్‌ల నుండి ఆఫ్టర్ పార్టీల వరకు సులభంగా తీసుకెళ్లగలిగే వైవిధ్యమైన శైలిని కలిగి ఉన్నాయి. మీరు కజిన్‌లను కలుసుకుంటున్నా, స్నేహితులతో పార్టీ చేసుకుంటున్నా, ఈ వాచ్‌లు మీ ప్రత్యేకతను తెలియజేస్తాయి.

“మేము రాత్రి ముగియదని విశ్వసించే తరం కోసం ‘ఆఫ్టర్ అవర్స్’ని రూపొందించాము” అని ఫాస్ట్రాక్ మార్కెటింగ్ హెడ్ డానీ జాకబ్ అన్నారు. “ఈ ప్రచారం యువత సంస్కృతిని – ఆకస్మిక ఆనందం, నిజమైన సంభాషణలు, ఉత్సాహాన్ని నిర్వచించే క్షణాల గురించి తెలుపుతుంది. మా కలెక్షన్ పగటి నుండి రాత్రి వరకు సరిపోయే స్టైల్‌గా ఉంటుంది, వేడుకలకు సరైన యాక్ససరీగా మారుతుంది” అన్నారు.

రూ. 5795/- ప్రారంభ ధరతో లభించే ఈ కలెక్షన్ పండుగ సీజన్‌లో మీ ఆనందాన్ని మరింత మెరుగుపరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. మీ సమీప ఫాస్ట్రాక్ స్టోర్, ఫాస్ట్రాక్ అధికారిక వెబ్‌సైట్ లేదా టైటాన్ వరల్డ్,దేశవ్యాప్తంగా ఉన్న ఇతర అధీకృత డీలర్లలో ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు. ఈ పండుగ సీజన్‌లో, మరపురాని రాత్రుల కోసం అత్యుత్తమ యాక్ససరీ అయిన ఫాస్ట్రాక్‌తో ఆఫ్టర్ పార్టీలో పాల్గొనండి. దీపాలు ఆర్పుతున్న వేళ, సరదా ఇప్పుడే ప్రారంభమవుతోంది.

About Author